సోము దెబ్బకు చేరేందుకే భయపడుతున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం అవుతుందని, అందరూ వచ్చి పార్టీలో చేరతారన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. కానీ ఇవన్నీ ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది. బీజేపీకి [more]

Update: 2020-11-20 06:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలోపేతం అవుతుందని, అందరూ వచ్చి పార్టీలో చేరతారన్న ప్రచారం నిన్న మొన్నటి వరకూ జరిగింది. కానీ ఇవన్నీ ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది. బీజేపీకి మంచి భవిష్యత్ ఉందని, అధికార పార్టీ పెడుతున్న ఇబ్బందుల నుంచి బయట పడాలంటే బీజేపీలో చేరడమే బెటర్ అని అనేక మంది నేతలు నిన్న మొన్నటి వరకూ భావించారు. జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలే బీజేపీ గూటికి చేరతారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇవేమీ జరగడం లేదు.

చేరికలు లేక…..

బీజేపీలో గత కొద్ది నెలలుగా చేరికలు లేకుండా పోయాయి. ప్రధానంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత బీజేపీలో కండువాలు కప్పే కార్యక్రమే కనపడటం లేదు. దీనికి ప్రధాన కారణం పార్టీలో చోటు చేసుకుంటున్న సంఘటనలే కారణమంటున్నారు. వరసగా పార్టీ నేతలపై సస్పెన్షన్లను వేస్తుండటం, బీజేపీ నేతలపై ఆంక్షలు పెట్టడంతోనే చేరికలకు ఫుల్ స్టాప్ పడిందంటున్నారు.

జనసేన కలయికతో….

నిజానికి బీజేపీ, జనసేన కలయికతో ఏపీలో చేరికలు పెరుగుతాయని భావించారు. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి తప్పించుకోవడానికైనా బీజేపీలో చేరాలని కొందరు టీడీపీ నేతలు భావించారు. ఈ మేరకు మానసికంగా సిద్దమయ్యారు కూడా. జనసేన, బీజేపీ పొత్తు తమకు కలసి వస్తుందని వారు సిద్దమయిన సమయంలో బీజేపీ పగ్గాలు సోము వీర్రాజు చేపట్టారు. ఇది పార్టీ మారాలనుకున్న నేతలకు రుచించలేదు.

చేరి లాభమేంటి?

దీనికి తోడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతుంది. చంద్రబాబు పార్టీ పదవులను కూడా భర్తీ చేశారు. దీంతో బీజేపీలో ఇక చేరికలు ఉండే అవకాశం లేదంటున్నారు. చంద్రబాబు బీజేపీతో సఖ్యతకు ప్రయత్నిస్తుండటం కూడా చేరికలు లేకపోవడానికి కారణంగా చెబుతున్నారు. మరికొద్దిరోజులు వెయిట్ చేస్తే క్లారిటీ వస్తుందని పార్టీని వీడాలనుకుంటున్న టీడీపీ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో కమలం పార్టీలో గత కొద్ది నెలలుగా చేరికలు లేక వెలవెలపోతుంది. భవిష్యత్ లోనూ ఆ పార్టీలో చేరికలు కష్టమేనంటున్నారు.

Tags:    

Similar News