బీజేపీ వైపు ఎవరూ చూడటం లేదా? కారణాలివేనా?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలనుకుంటోంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలి మీద లేస్తుంది. అయినా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు [more]

Update: 2020-10-02 15:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలపడాలనుకుంటోంది. ఇందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒంటికాలి మీద లేస్తుంది. అయినా ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి నోటాకు మించి ఓట్లు రాలేదు. కేంద్రంలో అధికారంలోకి రావడంతో బీజేపీ రాష్ట్రంలోనూ బలపడాలనుకుంది. తెలుగుదేశం పార్టీని బలహీన పర్చి తాను బలోపేతం కావాలనుకుంది.

టీడీపీని బలహీనపర్చాలని….

అయితే తెలుగుదేశం పార్టీ ఓటమి పాలయి కష్టాల్లో ఉండటంతో ఆ పార్టీని వీడే వారి సంఖ్య తొలినాళ్లలో ఎక్కువగా ఉంది. టీడీపీ నేతలు సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. వారి తర్వాత వరదాపురం సూరి, ఆదినారాయణరెడ్డిలు బీజేపీలో చేరిపోయారు. అంతే అక్కడి తో బీజేపీలో చేరే నేతలు ఆగిపోయారు. వరసబెట్టి తమ పార్టీలోకి వలసలు ఉంటాయని చెప్పిన బీజేపీ నేతల మాటలు ఒట్టిదేనని తేలిపోయింది.

చేరాలనుకున్న వారు కూడా…..

నిజానికి జేసీ దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు లాంటి నేతలు కూడా బీజేపీ వైపు చూశారు. కన్నా లక్ష్మ్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వలసల జోరు ఎక్కువగా ఉంది. టీడీపీని బలహీనపర్చాలన్న ఉద్దేశ్యంతో ఎక్కువగా ఆ పార్టీ నుంచే నేతలను చేర్చుకునేందుకే ప్రయత్నించారు. టీడీపీ నుంచి ఎక్కువగా వలసలుంటాయని బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.

ఎదగలేమనేనా?

ఎన్నికలు పూర్తయి పదిహేను నెలలు గడవడం, ఏపీలో బీజేపీ బలపడుతుందన్న నమ్మకం లేకపోవడంతో ఆ పార్టీవైపు చూడటం లేదు. ఒకదశలో గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఆయనకూడా వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేన పొత్తు ఉన్నప్పటికీ ఆ పార్టీలోకి వచ్చేందుకు ఎవరూ ఆసక్తికనబర్చకపోవడానికి సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా నియామకం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీలో ఎటువంటి వలసలు లేక ఆ పార్టీ వెలవెలపోతుందనే చెప్పాలి.

Tags:    

Similar News