కంట్రోల్ చేయాలని కొందరు… కరెక్టేనని మరికొందరు?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఆ పార్టీ నేతలకే అర్థం కాకుండా ఉంది. ఎవరు ఎటు వైపు మాట్లాడతారో వారికే తెలియదు. హైకమాండ్ మనసులో ఏముందో? ఎవరికీ [more]

Update: 2020-03-10 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఆ పార్టీ నేతలకే అర్థం కాకుండా ఉంది. ఎవరు ఎటు వైపు మాట్లాడతారో వారికే తెలియదు. హైకమాండ్ మనసులో ఏముందో? ఎవరికీ తెలియదు. అయినా కేంద్ర నాయకత్వం అనుమతితోనే తాము మాట్లాడుతున్నామని బిల్డప్ ఇచ్చే వారు కొందరు. ఇలా ఏపీ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందని చెప్పక తప్పదు. రాష్ట్ర బీజేపీలో వైసీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఈ మధ్య కాలంలో స్పీడ్ గానే పనిచేస్తున్నాయి.

రెండు వర్గాలుగా కన్పిస్తున్నా…..

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఒక వర్గంగానూ, కన్నా లక్ష్మీనారాయణ మరో వర్గంగానూ బయటకు కన్పిస్తున్నప్పటికీ వీరి వెనక సోము వీర్రాజు, పురంద్రీశ్వరి, సుజనా చౌదరి లాంటి నేతలు కూడా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రతిపాదన, శాసనమండలి రద్దు వంటి అంశాల్లో ఏ వర్గం వాదన వారిదే. కొందరు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

పవన్ తో కలిసిన తర్వాత కూడా….

ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో కలసిన తర్వాత కూడా రెండు పార్టీలు కలసి రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు చేసిన ప్రయత్నాలు జీరో అనే చెప్పాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొందరు బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావుపై పార్టీ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సయితం జీవీఎల్ కు క్లాస్ పీకారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. అయితే జీవీ‌ఎల్ ను కంట్రోల్ చేయాలని చెప్పిన నేతలు అలా వెళ్లిన వెంటనే కొందరు కేంద్ర నాయకత్వానికి ఆయనను అలానే మాట్లాడనివ్వమని కోరడం విశేషం.

కేంద్ర నాయకత్వం దృష్టికి…..

ఇందుకు కారణాలు కూడా వారు కేంద్ర నాయకత్వానికి వివరించారట. అమరావతి మూడు రాజధానుల అంశంపై గట్టిగా పట్టుబట్టి కూర్చుంటే పార్టీ అన్ని ప్రాంతాల్లో నష్టపోతుందని తెలిపారట. కేంద్ర నాయకత్వం సూచనలతోనే జీవీఎల్ తరచూ రాష్ట్ర పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో అనుకూలత వ్యక్తమవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా సంచయిత గజపతి రాజు విషయంలోనూ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. తమ పార్టీ నేతకు ముఖ్యమైన పదవి వస్తే వ్యతిరేకించడం సరికాదని కొందరు, పార్టీ లైన్ ను సంచయిత థిక్కరిస్తున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తూ పార్టీ లైన్ ఏదన్న విషయాన్ని ప్రజలకు సరిగా చేరవేయలేకపోతున్నారు.

Tags:    

Similar News