ఏపీలో బీజేపీ కోవర్ట్ ఆపరేషన్ మొదలయిపోయిందా?

ఒక పక్క టిడిపి ని అధికార వైసిపి చేత ఒక నొక్కు నొక్కిస్తూ మరోపక్క కోవర్ట్ ఆపరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ కమల్ ను బీజేపీ [more]

Update: 2020-07-08 09:30 GMT

ఒక పక్క టిడిపి ని అధికార వైసిపి చేత ఒక నొక్కు నొక్కిస్తూ మరోపక్క కోవర్ట్ ఆపరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ కమల్ ను బీజేపీ ముమ్మరం చేసినట్లే కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఇదే అంశాన్ని చెప్పకనే చెబుతున్నాయని జగన్ సర్కార్ ను హెచ్చరిస్తున్నాయి. నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు ఎపిసోడ్ దీనికి ఉదాహరణగా లెక్కేస్తున్నారు. బీజేపీ అండతోనే రాజు సొంతపార్టీపై చెలరేగిపోతున్నారని వైసిపి లో సైతం టాక్ నడుస్తుంది. ఆయన గెలిచిన నాటినుంచి బీజేపీ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం కమలం పెద్దలు సైతం ప్రోత్సహించడం గమనిస్తే నర్సాపురం ఎంపితోనే ఇది ఆగబోదని రాబోయే రోజుల్లో మరికొందరు ఇదే రూట్ లో పోవొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే రూట్ మార్చిన బీజేపీ …

తెలుగుదేశం, వైసిపి తో సమాన దూరం పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ లో ముందుకు అడుగులు వేయాలన్నది కమలం వ్యూహం. దానికి అనుగుణంగానే ఆ పార్టీ వ్యవహారాలు సాగుతున్నా కొన్ని సంస్థాగత ఇబ్బందులు కమలాన్ని కలవరపెడుతున్నాయి. టిడిపి అనుకూల, వైసిపి అనుకూల వర్గాలు బీజేపీ లో ఉండటంతో అనుకున్న విధంగా కార్యాచరణ ముందుకు సాగడం లేదు. బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలు ఒకేలా ఉండటం లేదు. ఒక్కో నేత ఒక్కో విధంగా విధాన నిర్ణయాలపై మాట్లాడుతూ ఉండటంతో కమలంలో గందరగోళం కంటిన్యూ అవుతుంది.

జనసేన కలిసినా ….

దీనికి తోడు జనసేన తో పొత్తు ఉన్నప్పటికీ ప్రధాన అంశాల్లో ఆ పార్టీని కమలం కలుపుని పోయే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఉమ్మడిగా ఈ రెండు పార్టీలు చేపట్టిన కార్యక్రమాలు కూడా పెద్దగా లేవు. దీనికితోడు వైరస్ వచ్చి పడటంతో బీజేపీ జనసేన ల ఉమ్మడి ఉద్యమాలు ఒక్క టిటిడి ఆస్తుల అమ్మకంలో తప్ప మరేమి లేకుండా పోయాయి. ఇసుక సమస్య, మద్యం పాలసీ, విద్యుత్ బిల్లులు పెంపు వంటి అనేక అంశాల్లో ప్రభుత్వ విధానాలు ఎండగట్టడంలో రెండు పార్టీలు ఒకే కంఠంతో ముందుకు పోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి ఎంపీలకు గేలం వేసి కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఎన్నికల్లోగా దెబ్బతీయాలనే కార్యక్రమం బీజేపీ తీవ్రతరం చేస్తే మాత్రం జగన్ పార్టీకి అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ స్థానాల్లోనూ గట్టిదెబ్బలే తగిలే ప్రమాదం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News