మొదటికే మోసం వచ్చేటట్లుందే?

ఏపీ బీజేపీ నేత‌లు త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నారా? ఏపీలో పార్టీని నిల‌బెట్టాల‌ని, పార్టీని విస్తరించాల‌ని భావిస్తున్న బీజేపీ నాయ‌కులు ఈ విష‌యంలో అనుస‌రిస్తున్న తీరు కొండ‌నాలుక‌కు మందేస్తే.. [more]

Update: 2019-10-17 09:30 GMT

ఏపీ బీజేపీ నేత‌లు త‌ప్పుల‌పై త‌ప్పులు చేస్తున్నారా? ఏపీలో పార్టీని నిల‌బెట్టాల‌ని, పార్టీని విస్తరించాల‌ని భావిస్తున్న బీజేపీ నాయ‌కులు ఈ విష‌యంలో అనుస‌రిస్తున్న తీరు కొండ‌నాలుక‌కు మందేస్తే.. ఉన్న నాలిక పోయిన‌ట్టు ఉందా? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఏపీలో విస్తరించాల‌నే విష‌యంలో త‌ప్పులేద‌ని, అయితే, దీనికి సంబంధించి వారు ఎంచుకుంటున్న మార్గాలు, ప్రస్తుత ప్రభుత్వంపై వారు కేంద్ర వ‌ద్ద చెబుతున్న ఫిర్యాదులు వంటివి బీజేపీనే ఇబ్బంది పాలు చేస్తాయ‌ని అంటున్నారు. మంగ‌ళ‌వారం ఏపీలోని జ‌గ‌న్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని ప్రారంభించాల‌ని ప్రధాని మోడీని ఆహ్వానించారు.

మోడీ వద్దామనుకున్నా…..

నిజానికి దీనివ‌ల్ల జ‌గ‌న్‌కు మేలు జ‌రిగేది కొంతే. నేరుగా ప్రధాని వ‌చ్చి ప‌థ‌కం ప్రారంభిస్తే.. ఆ క్రెడిట్ అంతా కూడా కేంద్రం ఖాతాలోనే ప‌డుతుంది. పైగా ఈ ప‌థ‌కంలో కేంద్రం నుంచి వ‌స్తున్న నిధులు కూడా క‌లిసి ఉన్నాయి. అయితే, ఈ విష‌యాన్ని ప‌రిశీలించ‌కుండానే బీజేపీ రాష్ట్ర నేత‌లు కేంద్ర బీజేపీ పెద్దల‌కు ఫిర్యాదులు చేశారు. ఫ‌లితంగా ఈ కార్యక్రమానికి వ‌చ్చేందుకు మోడీ సుముఖ‌త వ్యక్తం చేయ‌లేదు. గ‌తంలో చంద్రబాబు బీజేపీతో క‌లిసి ఉన్న స‌మ‌యంలో కూడా ఒక్క రాజ‌ధాని నిర్మాణానికి సంబంధించి మాత్రమే మోడీ ని ఆహ్వానించి శంకు స్థాప‌న చేయించారు. అది కూడా ఆయ‌న రాజ‌ధానికి భారీ ఎత్తున నిధులు ప్రక‌టిస్తార‌నే ఆశ‌తో. కానీ, జ‌గ‌న్ రైతు భ‌రోసా విష‌యంలో కేంద్రంపై ఎలాంటి ఆశ‌లూ పెట్టుకోలేదు.

పోలవరం ప్రాజెక్టు కూడా….

అయినా, బీజేపీ రాష్ట్ర నేత‌లు ఈ విష‌యంలో త‌ప్పట‌డుగు వేశారు. ఇక‌, ఇప్పుడు రాష్ట్రం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రమే చేప‌ట్టాల‌ని పేర్కొంటూ.. రాష్ట్ర బీజేపీ నేత‌లు తాజాగా కేంద్రం వ‌ద్ద మొర‌పెట్టుకున్నారు. పోల‌వ‌రాన్ని జ‌గ‌న్ పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్ ఆయ‌న‌కే వెళ్తుంద‌ని , అందుక‌ని మ‌న‌మే పూర్తి చేద్దామ‌ని వారు చెబుతున్నారు. అయితే, ఈ విష‌యంలోనూ బీజేపీ ఆలోచ‌న స‌రిగాలేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రాజెక్టు క‌ట్టినా క‌ట్టక‌పోయినా.. ప్రత్యేక హోదా విష‌యంలో కేంద్రం అనుస‌రించే విధానంపైనే రాష్ట్రంలో బీజేపీ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అంటున్నారు.

తప్పటడుగులతో…..

అంతేకాదు, పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో పున‌రావాస ప్యాకేజీనే ప్రధాన‌మని, ఈ ప్యాకేజీ ఇచ్చిన పార్టీల‌నే ప్రజ‌లు గుర్తు పెట్టుకుంటాయ‌నే క‌నీస ప‌రిజ్ఞానం కూడా బీజేపీ నేత‌ల‌కు లేకుండా పోయింద‌ని అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఓ విధాన‌ప‌ర‌మైన నిర్ణయం, ముందు చూపు లేకుండానే బీజేపీ రాష్ట్ర నేత‌లు వేస్తున్న అడుగులు, జ‌గ‌న్ పై చేస్తున్న ఫిర్యాదుల‌తో మొత్తానికే మోసం కొని తెచ్చుకుంటున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News