బలం లేకనా…? బలపడదని నమ్ముతున్నారా?

అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని భారతీయ జనతా పార్టీకి పెద్దయెత్తున వలసలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడటం, కేంద్రంలో బీజేపీ [more]

Update: 2020-04-01 00:30 GMT

అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్క సీటు కూడా సంపాదించుకోలేని భారతీయ జనతా పార్టీకి పెద్దయెత్తున వలసలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడటం, కేంద్రంలో బీజేపీ సర్కార్ నెలకొనడంతో ఎక్కువ మంది ఆ పార్టీ వైపు మొగ్గు చూపారు. అనేకమంది టీడీపీ నేతలు తమకు అండకోసం బీజేపీ బాట పట్టారు. అయితే దాదాపు నెలన్నర రోజుల నుంచి బీజేపీ వైపు రాష్ట్రంలో చూసేవారే లేరు.

ఫలితాలు వచ్చిన వెంటనే…?

ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పక్షాన చేరిపోయారు. అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ సయితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జమ్మలమడుగు నేత ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరారు. ఇలా వరసగా పార్టీలో చేరుతుండటంతో బీజేపీకి కొంత ఊపు వచ్చిందనే చెప్పాలి. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సయితం బీజేపీలో చేరతారన్న ప్రచారం జరిగింది.

స్థానిక సంస్థల ఎన్నికలతో…..

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో చేరికలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. క్షేత్రస్థాయిలో బీజేపీ బలహీనంగా ఉండటం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఆ పార్టీలో చేరితే ఉపయోగం లేదని భావించిన నేతలు తమ ఆలోచనను విరమించుకున్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి చేరికలు ఉంటాయని బీజేపీ నేతలు పదే పదే ప్రకటించారు. అయితే ఒక్కరు కూడా ఇటీవల కాలంలో పార్టీలో చేరకపోవడం గమనార్హం.

జనసేన పొత్తు కూడా…..

ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. బీజేపీతో జనసనే పొత్తు పెట్టుకోవడం ఒక కారణమని అంటున్నారు. జనసేనతో పాత్తు గిట్టని కొందరు నేతలు బీజేపీ వైపు చూడటం లేదు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియామకంలో క్లారిటీ రాకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద బీజేపీలో చేరేందుకు ఎక్కువగా టీడీపీ నేతలే తొలుత ఉత్సాహం చూపారు. అయితే దాదాపు పది నెలలు గడిచపోవడం, టీడీపీ కొంత కుదుటపడుతుండటంతో బీజేపీలో చేరేందుకు పెద్దగా ఇష్టపడటం లేదని అంటున్నారు. మొత్తం మీద కమలం పార్టీలో చేరికలకు బ్రేక్ పడినట్లా? ఫులస్టాప్ పడినట్లా?

Tags:    

Similar News