వీళ్లిద్దరికీ అంత సీన్ లేదట.. అసలు విషయం ఇదేనట

భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఎదగడానికి అనేక కారణాలున్నాయి. వాజ్ పేయి, అద్వానీ సమయంలోనే బీజేపీ కొంత దేశ వ్యాప్తంగా పుంజుకుంది. అయితే వారు విలువలతో [more]

Update: 2020-12-11 16:30 GMT

భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో ఎదగడానికి అనేక కారణాలున్నాయి. వాజ్ పేయి, అద్వానీ సమయంలోనే బీజేపీ కొంత దేశ వ్యాప్తంగా పుంజుకుంది. అయితే వారు విలువలతో కూడిన రాజకీయాలు చేయడంతో అంత ఫాస్ట్ గా రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదల సాధ్యం కాలేదు. తమ వెంట ఉన్న మిత్రులను సయితం వాజ్ పేయి, అద్వానీ లు గౌరవంగా చూసేవారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడిచేవారు. అందుకే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో ఎదగలేదు.

విలువలకు తిలోదకాలు….

కానీ మోదీ, షాల హయాంలో బీజేపీ అన్ని విలువలకు తిలోదకాలు వదిలింది. మోదీ ఇమేజ్, అమిత్ షా చతరుత వల్లనే దేశ వ్యాప్తంగా కమలం పార్టీ వికసించిందనడం పూర్తిగా అవాస్తవం. అది కేవలం ఐదుశాతం మాత్రమే పనిచేసింది. కానీ వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ బలహీనం కావడంతోనే బీజేపీ పుంజుకుందన్నది వాస్తవం. కానీ కాంగ్రెస్ రాష్ట్రాల్లో వీక్ కావడానికి ప్రాంతీయ పార్టీలే కారణమని చెప్పక తప్పదు. ఎక్కడైతే కాంగ్రెస్ బలహీనంగా ఉందో అక్కడ బీజేపీ పుంజుకునే ప్రయత్నం చేసి సక్సెస్ కాగలిగింది.

యూపీ, బీహార్ లలో…

ఉత్తర్ ప్రదేశ్ లో మాయావతి, అఖిలేష్ యాదవ్ లు ప్రాంతీయ పార్టీలుగా తాము విజయం సాధించడానికి కాంగ్రెస్ ను బలహీనపర్చారు. ముస్లిం, యాదవ, దళిత ఓటు బ్యాంకులతో ముందుకు వెళ్లారు. కాంగ్రెస్ కూడా వారితో పొత్తుకు దిగింది. దీంతో అక్కడ బీజేపీకి స్పేస్ ఏర్పడింది. తాజాగా జరిగిన బీహార్ ఎన్నికల్లో సయితం లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ ముస్లిం, యాదవ ఓట్లతో వెళుతూ కాంగ్రెస్ ను బలహీనపర్చింది. దీంతో ఇక్కడ బీజేపీ హిందుత్వ కార్డును వాడి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది.

ఏపీ, తెలంగాణలోనూ…..

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ జగన్ ను దూరం చేసుకోవడంతో అక్కడ సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్లగట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ లేదు. క్రమంగా బీజేపీ పుంజుకునే అవకాశాలున్నాయి. తెలంగాణలోనూ కేసీఆర్ కాంగ్రెస్ ను బలహీనపర్చారు. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను వీక్ చేయడమే కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ఆ పార్టీ పూర్తిగా దెబ్బతినింది. దీంతో ఇక్కడ బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. సో.. మోదీ, షాల ప్రతిభ అనే చెప్పుకోవడం కన్నా కాంగ్రెస్ బలహీనపడటమే బీజేపీకి కలసి వచ్చిందని చెప్పాలి.

Tags:    

Similar News