ఎదురుతంతున్నాయి ఎందుకో?

2014 లోక్ సభ ఎన్నికలనాటికి నరేంద్ర మెాదీ ఎవరో? ఏమిటో? ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ముాడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఢిల్లీ రాజకీయాలకు ఎపుడుా [more]

Update: 2020-03-24 16:30 GMT

2014 లోక్ సభ ఎన్నికలనాటికి నరేంద్ర మెాదీ ఎవరో? ఏమిటో? ఎవరికీ పెద్దగా తెలియదు. ఆయన ముాడు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఢిల్లీ రాజకీయాలకు ఎపుడుా దుారంగా ఉండేవారు. రాష్ర్టాభివృద్ధి, రాష్ర్టంలో పార్టీ విస్తరణపైనే దృష్టి సారించేవారు. ఇక ఆయన ‘ఆత్మ’ గా అందరుా పేర్కొనే అమిత్ షా గురించి అసలు తెలియదు. ఆయన కనీసం రాష్ర్టస్దాయి నాయకుడు కుాడా కాదు. రాష్ర్టంలో ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి. 2014 లో బీజేపీ పగ్గాలు చేపట్టే నాటికి ఆయన రికార్డు చాలా పేలవంగా ఉండేది. 2014 ఎన్నికల సమయంలో రాజనాధ్ సింగ్ (ప్రస్తుత రక్షణ మంత్రి) పార్టీ అద్యక్షుడిగా ఉండేవారు. అమిత్ షా అప్పట్లో దేశంలో పెద్ద రాష్ర్టమైన యుాపీ ఇన్ ఛార్జ్ గా ఉండేవారు. తరువాత కాలంలె ప్రధాని మెాదీ, పార్టీ అద్యక్షుడిగా అమిత్ షా జోడీ అద్భుతాలు స్నష్టించింది. వీరి మెుదటి దఫా పాలనలో పార్టీ దినదినాభివ్రద్ధి చెందింది. ఆసేతు హిమాచలం విస్తరించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ తన ఉనికిని బలంగా చాటింది. ఇందుకు కారణం మెాదీ, షాలేనని చెప్పడం అతిశయెాక్తి కాదు. మెుదటి అయిదేళ్ల పాలన నల్లేరు మీద నడకలా సాగింది. ఇదే ఊపుతో 2019 లోక్ సభ ఎన్నికల్లో ఎవరుా ఊహించని రీతిలో ఘనవియాన్ని సాధించింది. 300 కు పైగా స్దానాలతో తిరుగులేని ఆధిక్కతతో ముందుకు వెళ్లింది. ఈ ‍ఫలితాల ప్రాతిపదికన చుాస్తే మెుదటి ధఫా (2014-2019) లో మాదిరిగా కమలం దుాసుకు పోవాలి. తిరుగులేని పట్టు సాధించాలి.

రెండో దఫా పాలనలో….

కానీ ఎన్డీఏ రెండో దఫా పాలన మెాదీ-షా లకు కలసివచ్చినట్లు లేదు. అసెంభ్లీ ఎన్నికల్లో ఇబ్బందులు, న్రభుత్వ నిర్ణయాలతో చిక‌్కులు, మిత్రలు దుారమవడంతో మెాదీ యంత్రాంగం, షా ఎత్తుగడలసై అనుముానాలు కలుగుతున్నాయి. లోక్ సభలో సం‌ఖ్యాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికి వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ప్రభుత్వ నిర్నయాలు ప్రతికుాలంగా మారడంతో ఇద్దరు అధినేతలు ఆత్మరక్షణలో పడినట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గతఏడాది జరిగిన మహారాష్ర్ట, హర్యానా, జార్ఖాండ్, తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కమలనాధులను కషాయం తాగించాయి. మహారాష్ర్టలో అతి పెద్ద పార్టీగా నిలచినప్పటికి చిన్ననాటి మిత్రపక్షం శివశేన ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో విఫలమై అధికారానికి దుారమవ్వాల్సివచ్చింది. హర్యానాలో అతికష్టం మీద అధికారాన్ని కాపాడుకుంది. జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అధినేతలను కుంగదీసింది.

19 చోట్ల అధికారంలో…..

రేపటి బీహార్ ఎన్నికల ఫలితాలు కుాడా ఇందుకు భిన్నంగా ఉండవచ్చన్న అంచనాలను తోసిపుచ్చడం కష్టమే. ఎన్డీఏ తొలి దఫా పాలనలో మెుత్తం 29 రాష్ర్టాలకు గాను 19 చోట్ల ప్రభుత్వాలను ఏర్నాటు చేసి సత్తా చాటింది. పార్టీకి పెద్దగా పట్టులేని అసోం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్ ల్లో అధికారాన్ని అందుకుంది. కశ్మీర్లో పీడీపీ (peaples democratic front) తో సర్కార్ నూ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 28 రంష్ర్టాలకు గాను 14 చోట్ల మాత్రమే అధికరంలో ఉంది. వీటిల్లో గోవా, మిజోరాం, మణిపాల్, సిమ్లా, నాగాలాండ్ ల్లో సంకీర్ణ ప్రభుత్వాలు కావడం గమనార్హం. మిత్రపక్షాలతో ఏ మాత్రం తేడావచ్చినా ఇంతే సంగతులు. మెుత్తం 28 కు గాను 14 రాష్ర్టాల్లో అధికారం ఉందంటే సగం రంష్ర్టాల్లో లేనట్లే. దీన్ని తక్కువగా అంచనా వేయడం కష్టమే. ఈ ఏడాది అక్టోబరు/నవంబరుల్లో .రిగే బీహార్, వచ్చే ఏడాది జరిగే పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో కమలం మనుగడపై సందేహాలు లేకపోలేదు.

అన్నీ ఎదురుదెబ్బలే…..

ఎన్డీఏ రెండు దఫా పాలనలో రాష్ర్టాల ఎన్నికల్లో ఎదురు దెబ్బలు, ప్రభుత్వ నిర్లయాలపై ప్రజాగ్రహానికి కారణం మెాదీ-షా అనుచిత విధానాలు, అహంకారమే కారణమన్న అభిప్రాయం ఉంది. ‘ కాంగ్రెస్ ముక్త’ భారత్ అన్న అమిత్ షా అహంకార పుారిత ప్రకటనలు ఎదురుతన్నాయి. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, పంజాబ్ వంటి పెద్ద రాష్ర్టాల్లో అధికారంలో ఉంది. మహారాష్ర్ట, జార్ఖండ్ సంకీర్ణ సర్కారులో భాగస్వామి. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌర పట్టిక, ముస్లిం తలాక్, 370 వ అధికరణ రద్దు, తరచుా మెాదీ విదేశీ పర్యటనలు ప్రజలను మెప్పించలేకపోయాయి. విధానాలను పక్కనపెడితే ప్రజలకు ఏం కావాలో పార్టీ పట్టించుకోవడంలేదు. భావోద్వేగ అంశాలు ఎల్లకాలం ఓట్లను కురిపిస్తాయనుకోవడం పొరపాటు. ఈ విషయాలు ప్రజల ఆకలి దప్పులు తీర్చవు. కాలే కడుపుతో ఉన్నవాడికి వృద్ధిరేటు, జీడీపీ, అభివృద్ది సుాచీలు అన్నం పెట్టవు. మెాదీ, షా నేల విడిచి సాముచేస్తే మున్ముందు మరిన్ని ఇబ్బందులు, చిక్కులు తప్పవు. వీటిని సరిదిద్దుకుంటేనే పార్టీకి మనుగడ.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News