వన్ బై వన్ అందుకేనట

పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. కేంద్రంలో బీజేపీనే ఉండాలని యావత్ భారతం భావించింది. అందుకే బీజేపీ సొంత మెజారిటీతో [more]

Update: 2019-12-25 16:30 GMT

పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి స్పష్టమైన మెజారిటీని ప్రజలు కట్టబెట్టారు. కేంద్రంలో బీజేపీనే ఉండాలని యావత్ భారతం భావించింది. అందుకే బీజేపీ సొంత మెజారిటీతో కేంద్రంలో రెండోసారి అధికారంలోకి రాగలిగింది. కానీ పార్లమెంటు ఎన్నికలకు ముందు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం వరస ఓటములు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి కారణం రాష్ట్రాల్లో సరైన నాయకత్వం లేకపోవడమేనని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో తప్ప…..

పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని బీజీపీ సాధించింది. 302 స్థానాలను సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది. అంతకు ముందు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. ఈ మూడు రాష్ట్రాల్లో అప్పట్లో బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్ లోదాదాపు పదిహేనేళ్లపాటు అధికారంలో ఉండటంతో అక్కడ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్న అంచనాకు కమలనాధులు వచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ పై ప్రజల్లో అనుకూలత ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకతతో కోల్పోవాల్సి వచ్చింది.

అన్ని రాష్ట్రాల్లో…..

ఇక రాజస్థాన్ లో అప్పటి ముఖ్యమంత్రి వసుంధర రాజే ఏకపక్ష నిర్ణయాలతో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు రెండేళ్ల నుంచి వసుంధరపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడినా ఆమెను తొలగించే సాహసాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వం చేయలేకపోయింది. ఇక ఛత్తీస్ ఘడ్ లోనూ అప్పటి ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పై ప్రజల్లో సదభిప్రాయం ఉండేది. కాని దీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్లనే పార్టీ ఓటమి చెందాల్సి వచ్చిందని పార్టీ నేతలే అప్పట్లో విశ్లేషణ చేశారు.

లోకల్ నాయకత్వ లోపమేనా?

తాజాగా జరిగి హర్యానాలోనూ అతి కష్టం మీద అధికారాన్ని తెచ్చుకోగలిగింది. అయితే మహారాష్ట్రలో మాత్రం శివసేన హ్యాండ్ ఇవ్వడంతో ఆ రాష్ట్రంలో అధికారానికి బీజేపీ దూరమయింది. ఇక తాజాగా జార్కండ్ ఎన్నికల్లో ప్రజలు వన్ సైడ్ గా కాంగ్రెస్ కూటమి వైపు నిలిచారు. దీంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఐదు రాష్ట్రాలను బీజేపీ చేజార్చుకోవాల్సి వచ్చింది. దీంతో కమలం పెద్దలు రాష్ట్రాల నాయకత్వాన్ని బలోపేతం చేయాలని నిర్ణయానికి వచ్చారు. జార్ఖండ్ లో ఓటమికి స్థానిక నాయకత్వం కారణమేనని బీజేపీ పెద్దలు అంచనాకు వచ్చారు. మొత్తం మీద బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా రాష్ట్రాలు కోల్పోతుండటం ఆందోళనకర పరిణామమే.

Tags:    

Similar News