గంటల వ్యవధిలోనే….లక్ష వోల్ట్ ల షాక్

ఆరుగంటల్లోనే ముఖచిత్రాన్ని మార్చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. టైగర్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను [more]

Update: 2019-11-23 04:01 GMT

ఆరుగంటల్లోనే ముఖచిత్రాన్ని మార్చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. టైగర్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలను మార్చేశారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు నిన్న రాత్రి వరకూ సమావేశాలు నిర్వహించాయి. ఉద్ధవ్ థాక్రేకు సీఎం పదవి, కాంగ్రెస్, ఎన్సీపీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు అంటూ అగ్రిమెంట్ కుదిరింది. అయితే రాత్రికి అందరూ ఇంటికి వెళ్లిపోయి నిద్రలోకి జారుకున్న తర్వాత రాజకీయాన్ని కమలనాధులు మొదలు పెట్టేశారు. ఇది నిజంగా ఎవరూ ఊహించనిదే. దటీజ్ మోదీ… దటీజ్ అమిత్ షా.

ప్రతిపక్షంలో ఉంటామంటూనే…..

ఎనిమిది నెలలు కూడా సంకీర్ణ ప్రభుత్వం కొనసాగలేదని, తాము ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని చెప్పిన భారతీయ జనతా పార్టీ ఉన్నట్లుండి కాంగ్రెస్, శివసేనలకు లక్షల వోట్ల షాకిచ్చింది. కేవలం ఆరు గంటల్లోనే రాజకీయం అంటే ఏందో మోడీ, అమిత్ షా రుచి చూపించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయినప్పుడే కాంగ్రెస్, శివసేనలు అనుమానించాల్సి ఉన్నా వారు శరద్ పవార్ ను గట్టిగా నమ్మారు. అందుకే ఎడతెరిపి లేకుండా చర్చలు జరిపారు. శరద్ పవార్ కూడా చర్చల పేరుతో కాలయాపన చేశారు.

నిద్రలో ఉండగానే….

త్వరలో ప్రమాణ స్వీకారం చేద్దామని సుఖ నిద్రలో ఉన్న శివసేన నేతలకు ఉదయం నిద్ర లేచిన వెంటనే షాక్ తగిలిందనే చెప్పాలి. మైండ్ బ్లాంక్ అయింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సయితం దీర్ఘకాల మిత్రుడైన శరద్ పవార్ ను దూరం చేసుకోవడం ఇష్టంలేకనే ఇష్టం లేకపోయినా శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓకే చెప్పారు. అయితే శరద్ పవార్ శివసేన, కాంగ్రెస్ తో చర్చలు జరుపుతూనే తనకు ప్రయోజనం అధికంగా ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపారు. తనకు తెలియకుండా జరిగిందని శరద్ పవార్ చెబుతున్నా ఆయన వెనకుండి అజిత్ పవార్ ను బీజేపీలోకి పంపేశారన్నది వాస్తవమంటున్నారు. తెల్లవారే సరికి ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేసేశారు. మరి శివసేన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News