బీజేపీ జగన్ ను ముద్దు చేయాల్సిందేనా ?

ఎవరు అవునన్నా కాదన్నా జగన్ ఇపుడు పొలిటికల్ గా టవరింగ్ పర్సనాలిటీగా మారిపోయారు. దాని వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ ఇపుడు వాటి ఫలాలు వడ్డీతో [more]

Update: 2020-06-20 06:30 GMT

ఎవరు అవునన్నా కాదన్నా జగన్ ఇపుడు పొలిటికల్ గా టవరింగ్ పర్సనాలిటీగా మారిపోయారు. దాని వెనక పదేళ్ల కష్టం ఉంది. కానీ ఇపుడు వాటి ఫలాలు వడ్డీతో సహా జగన్ కి వస్తున్నాయి. బంపర్ మెజారిటీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది. దాంతో 22 మంది ఎంపీలు వైసీపీకి లోక్ సభలో ఉన్నారు. నాలుగో అతి పెద్ద పార్టీగా టీడీపీ ఉంది. ఇక రాజ్యసభలో చూసుకుంటే తాజా గెలుపుతో ఆరుగురు ఎంపీలు వైసీపీ పక్షాన ఉన్నారు. అంటే ఎగువసభలో ఇది ఏ మాత్రం తీసివేయలేని బలం. దాంతో బీజేపీ జగన్ ని ఎత్తుకుని ముద్దు చేయాల్సిదేనని అంటున్నారు.

మెజారిటీకి దూరమే….?

ఇక ఈ రాజ్యసభ ఎన్నికలు ముగిసాక చూసుకున్నా కూడా బీజేపీకి పెద్దల సభలో ఎన్టీయే మిత్రులను కలుపుకున్నా కూడా ఇంకా ఇరవై మందికి పైగా సభ్యుల మద్దతు కొరత పడుతోంది. ఆ లోటు తీర్చుకోవాలంటే కచ్చితంగా వైసీపీకి చెందిన ఆరుగురు ఎంపీలు అత్యంత కీలకమని చెప్పకతప్పదు. అప్పట్లో టీడీపీకి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉంటే ఇపుడు ఒక్కరే ఉన్నారు. దాంతో చంద్రబాబు ముఖమైనా చూడలేని స్థితి ఉంది. అదే సమయంలో జగన్ ని అలా కళ్లారా చూడాలని కమలనాధులకు అనిపిస్తోందిట.

అలా పెరుగుతూనే …..

ఇక వైసీపీ వైపు చూస్తే మళ్లీ రెండేళ్లకు అంటే 2022 నాటికి మరో నలుగురు ఎంపీలు ఆ పార్టీకే వస్తారు. 2024 నాటికి అంటే ఎన్నికల ఏడాదిలో కూడా మరో నలుగురు ఎంపీలు వస్తారు. వీరిలో ఇద్దరు ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి మధ్యలో రిటైర్ అవుతారు అనుకున్నా కచ్చితంగా మరో ఆరుగురు ఎంపీలు మాత్రం వైసీపీ ఖాతాలో రాజ్యసభకు వస్తారన్న మాట. ఆ విధంగా చూసుకుంటే 2024 నాటికి 12 మంది ఎంపీలతో జగన్ ప్రభ పెద్దల సభలో ఘనంగా వెలిగిపోతుంది అంటున్నారు.

మొక్కక తప్పదుగా ….

ఇదిలా ఉంటే ఎన్నో కీలకమైన బిల్లులు ఈ మధ్యలో బీజేపీ నెగ్గించుకోవాల్సి ఉంది. కానీ వచ్చే నాలుగేళ్లలో కూడా కమలానికి రాజ్యసభలో బలం పెరిగినా కూడా మెజారిటీకి మాత్రం అపుడూ దూరమేనని అంటున్నారు. అదే సమయంలో వైసీపీకి రాజ్యసభలో గణనీయమైన బలం వస్తుంది. దాంతో జగన్ చుట్టూనే బీజేపీ ప్రదక్షిణం చేయకతప్పదు అంటున్నారు. ఓ విధంగా ఏపీ రాజకీయాల్లో టీడీపీ తరువాత మరో రాజకీయ పార్టీగా వైసీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అంటున్నారు. మరి జగన్ తెలివిగా ఒడుపుగా ఈ అవకాశాలను వాడుకుని ఏపీ అభివృధ్ధికి అనుకూలంగా మలచుకుంటే ఆయన 2024 తరువాత మళ్లీ ఏపీ సీఎం గా గెలిచే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయని విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News