ఎర్త్ ఇలా కూడా పెట్టవచ్చుగా?

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మిత్రులను కూడా శత్రువులను చేసుకుంటూ పోవడం రాజకీయాల్లో సర్వసాధారణమే. ఇందులో బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుంది. దశాబ్దాల నుంచి [more]

Update: 2020-10-13 17:30 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. మిత్రులను కూడా శత్రువులను చేసుకుంటూ పోవడం రాజకీయాల్లో సర్వసాధారణమే. ఇందులో బీజేపీ ఒక అడుగు ముందే ఉంటుంది. దశాబ్దాల నుంచి ఉన్న మిత్రులనే బీజేపీ దూరం చేసుకోగలిగింది. శివసేన, అకాలీదళ్ వంటి నమ్మకమైన మిత్రులనే వదిలేసుకున్నప్పుడు మిగిలిన వారు వారికి పెద్ద సమస్య కానే కాదు. ఇప్పుడు బీహార్ ఎన్నికల సమయంలోనూ బీజేపీ ఆడుతున్న నాటకాలపై రాజకీయ విశ్లేషకులు సయితం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తమ సీఎం అభ్యర్థి అంటూ…..

బీహార్ లో తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని బీజేపీ పదే పదే చెబుతుంది. సీట్ల పంపకాలుకూడా పూర్తయ్యాయి. జేడీయూ 122 స్థానాల్లోనూ, బీజేపీ 121 స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించకున్నాయి. ఇక మరో మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ మాత్రం కూటమి నుంచి బయటకు వెళ్లిపోయింది. బయటకు వెళుతూ వెళుతూ నితీష్ కుమార్ పై బురద జల్లి వెళ్లిపోయింది. దీని వెనక బీజేపీ పెద్దలు ఉన్నారన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతోంది.

నమ్మకమైన పార్టీయే….

నిజానికి లోక్ జనశక్తి పార్టీ బీజేపీతో తన అనుబంధాన్ని దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వస్తోంది. రామ్ విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ తమ సిద్ధాంతాలు వేరైనా బీజేపీతో కలసి పనిచేస్తూ వస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిపదవిని కూడా తీసుకుంటుంది. అలాంటి పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినా తాము కేంద్రంలోనూ, రాష‌్ట్రంలోనూ బీజేపీకి మద్దతుగానే ఉంటామని చెబుతుండటం విశేషం.

నితీష్ టార్గెట్ గా….

కేవలం నితీష్ కుమార్ టార్గెట్ గానే లోక్ జనశక్తి పార్టీ బీహార్ ఎన్నికలలో పనిచేస్తుందంటున్నారు. జేడీయూ అభ్యర్థుల ఓటమి కోసం తమ పార్టీ అభ్యర్థి ఉంటారని ఎల్జేపీ చెబుతుంది. ఈ తతంగం మొత్తం వెనక బీజేపీ పెద్దలు ఉన్నారంటున్నారు. ఈఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ 49 స్థానాలను అడిగింది. అయితే నితీష్ కుమార్ మాత్రం బీజేపీకి కేటాయించిన సీట్లలోనే వారికి సర్దాలని చెప్పారు. దీంతో బీజేపీ అన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే నితీష్ కుమార్ ను సాకుగా చూపి ఎల్జేపీని బీజేపీయే దగ్గరుండి బయటకు పంపిందంటున్నారు. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరిస్తే నితీష్ ను పక్కన పెట్టి తమ పార్టీ నేతను ముఖ్యమంత్రిగా చేేసే ఆలోచనను కూడా బీజేేపీ చేస్తుందంటున్నారు. అయితే అసలుకే ఎసరు వస్తే అన్న ప్రశ్నకు మాత్రం కమలనాధుల వద్ద సమాధానం లేదు.

Tags:    

Similar News