ఏదో రకంగా కలసి వస్తుందే?

ఒకే విధానం.. మతం కార్డు.. అదే కార్డుతో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి అయోధ్య రామమందిరం దొరికింది. తెలంగాణలో కొంత రాజకీయంగా స్పేస్ కన్పిస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. [more]

Update: 2021-02-12 09:30 GMT

ఒకే విధానం.. మతం కార్డు.. అదే కార్డుతో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి అయోధ్య రామమందిరం దొరికింది. తెలంగాణలో కొంత రాజకీయంగా స్పేస్ కన్పిస్తుండటంతో బీజేపీ దూకుడు పెంచింది. వీలయినన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న ధ్యేయంతో ముందుకు వెళుతుంది. గతంలో తమకు అనుకూలించిన అంశాలనే బీజేపీ ఎంచుకుంటూ ఎదగాలని భావిస్తుంది. అధికార టీఆర్ఎస్ నేతలు బీజేపీ ట్రాప్ లో పడిపోతుండటం దానికి అనుకూలంగా మారింది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో….

దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణకు ఊపు వచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎటువంటి మతం కార్డును బీజేపీ ఉపయోగించలేదు. కేవలం అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తూ తమ ప్రచారాన్ని సాగించారు. దీనికి తోడు అధికార పార్టీ అభ్యర్థిపై అసంతృప్తి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై సానుభూతి ఈ ఎన్నికల్లో పనిచేయడంతో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కూడా బండిసంజయ్ అరెస్ట్ ల వంటి ఘటనలతో పార్టీకి కొంత ఊపు వచ్చింది.

పాతబస్తీని ముందు పెట్టి…..

ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్లాన్ మార్చింది. ఎంఐఎం, టీఆర్ఎస్ ల బంధాన్ని ప్రచారంలో ఎక్కువగా వాడుకుంది. భాగ్యలక్షి అమ్మవారి సాక్షిగా ప్రమాణాలతో మరింత ఊపు తేగలిగింది. ఇక ఎన్టీఆర్, పీవీ ఘాట్ లను కూల్చివేయాలన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకోగలిగింది. పాతబస్తీ లో సర్జికల్ స్ట్రయిక్ లు చేస్తామన్న కామెంట్స్ తో హీట్ పుట్టించి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి ముందుకు రాగలిగింది. టీఆర్ఎస్ కు చెమటలు పట్టించగలిగింది.

అయోధ్య రామమందిరం….

ఇక వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అయోధ్య రామమందిరం అంశాన్ని తీసుకుంది. అయోధ్య రామాలయానికి నిధుల సేకరణను బీజేపీ పెద్దయెత్తున చేపట్టింది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయోధ్య రాముడి విరాళాలపై చేసిన వ్యాఖ్యలను బీజేపీ అనుకూలంగా మలచుకుంది. పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా ససేమిరా అంటుంది. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో దీనిని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుంది. మొత్తం మీద బీజేపీ ట్రాప్ లో టీఆర్ఎస్ నేతలు పడుతుండటంతో దానిని అనుకూలంగా మలచుకుంటుంది.

Tags:    

Similar News