ఎవరు ముందు..?

మహారాష్ట్ర రాజకీయాలు మహా రంజుగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ అధికారం చెరిసగం సమయం కావడంతో బీజేపీ అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. శివసేన [more]

Update: 2019-10-25 18:29 GMT

మహారాష్ట్ర రాజకీయాలు మహా రంజుగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ అధికారం చెరిసగం సమయం కావడంతో బీజేపీ అగ్రనేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. శివసేన చేతిలో చిక్కుకోక తప్పదన్నది బీజేపీ నేతలు మదన పడుతున్నారు. నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఆశించిన విజయాలను సాధించలేకపోయింది. శివసేన గతంలో కంటే మెరుగైన ఫలితాలను సాధించలేకపోయినా తన సీట్ల సంఖ్యను మాత్రం నిలబెట్టుకోగలిగింది. అందుకనే శివసేన స్వరం పెంచింది.

చెరి రెండున్నరేళ్లు….

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీకి 103 సీట్లు దక్కాయి. మిత్రపక్షమైన శివసేనకు 56 సీట్లు లభించాయి. రెండు పార్టీలు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి. 2014 ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేసి ఫలితాల అనంతరం పొత్తుకు దిగాయి. కానీ ఈసారి ఎన్నికలకు ముందే పొత్తు కుదుర్చుకోవడంతో అధికారంలోకి వచ్చినప్పటికీ శివసేనకు సీఎం పదవి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడంది. బీజేపీ, శివసేనలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకుంటాయి. అలాగే మంత్రి వర్గ సభ్యుల్లో కూడా అదే నిష్పత్తి ఉండాలని శివసేన గట్టిగా కోరుకుంటోంది.

తొలుత తమకేనంటూ….

అయితే అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీ తొలుత సీఎం పదవి తమకే దక్కాలని గట్టిగా కోరుతుంది. ఇప్పటికే వర్లీ నుంచి గెలిచిన శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సీఎం అంటూ శివసైనికులు మహారాష్ట్ర మొత్తం పోస్టర్లు వేశారు. రెండో విడత కంటే తొలి విడతే తమకు సీఎం పదవి ఇవ్వాలన్నది శివసేన డిమాండ్ గా కన్పిస్తుంది. ఉద్ధవ్ థాక్రే ఈ మేరకు బీజేపీ నేత ఫడ్నవిస్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఫడ్నవిస్ మాత్రం అధిష్టానం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అమిత్ షా దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశముంది.

మంత్రి పదవులు కూడా….

కేవలం ముఖ్యమంత్రి పదవి మాత్రమే కాదు మంత్రి పదవులను కూడా చెరి సగం పంచాలంటోంది శివసేన. అలాగే ప్రాధాన్యత కల్గిన మంత్రి పదవులు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటోంది. దీనిపై పూర్తి స్థాయిలో బీజేపీ అగ్రనేతలు చర్చించనున్నారు. శివసేనను దూరం చేసుకునే స్థితిలో బీజేపీలేదు. బీజేపీని విడిచిపెట్టే ఆలోచనలో శివసేన లేదు. అందుకే శివసేన డిమాండ్లకు తలొగ్గక తప్పదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో శివసేన తన డిమాండ్లను సాధించుకునే స్థితిలోనే ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనిపై మరికొద్ది గంటల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News