ఒక ఫేస్ కావాలట

అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్లుగా ఎపుడూ తెలుగు రాష్ట్రాలో కమలం పార్టీకి కష్టాలే.కేంద్రంలో అధికారం చలాయించినా కూడా ఇక్కడ మాత్రం కనీస గౌరవం లేకుండానే [more]

Update: 2019-07-17 00:30 GMT

అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని ఉందన్నట్లుగా ఎపుడూ తెలుగు రాష్ట్రాలో కమలం పార్టీకి కష్టాలే.కేంద్రంలో అధికారం చలాయించినా కూడా ఇక్కడ మాత్రం కనీస గౌరవం లేకుండానే పార్టీ మనుగడ సాగిస్తోంది. అప్పట్లో వాజ్ పేయ్, ఇపుడు మోడీ ఎలాంటి గొప్ప నాయకులు, ఇక అద్వానీ వంటి వారు రెండు అంకెల బీజేపీని రెండు వందల సీట్లకు తీసుకువచ్చారు. ఏడారిలో నీటిని, ఇసుకలో తైలాన్ని తీసే ఆర్ఎస్ఎస్ నాయకత్వం క్షేత్ర స్థాయి నుంచి గట్టిగా ఉంది. అయినా తెలుగు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి చిక్కడం లేదు. అధికారం పక్కన పెట్టి రెండంకెల సీట్లు కూడా రాకపోవడం కాషాయ పార్టీ పెద్దలకే అతి పెద్ద పజిల్ గా ఉందంటున్నారు. మోడీ మొదటిసారి గెలిచినపుడు మ్యాజిక్ అన్నారు. ఇపుడు రెండవసారి అంతకంటే కూడా ఎక్కువ సీట్లతో పవర్ సాధించి ప్రధాని అయ్యారు. తన నాయకత్వాన్ని గట్టిపరచుకున్నారు. దాంతో ఎలాగైనా తెలుగు రష్ట్రాలో పాగా వేయాలని బీజేపీ బల‌మైన సంకల్పమే పెట్టుకుంది. ఆపరేషన్ తెలుగు స్టేట్స్ అంటూ దూకుడుగానే రంగంలోకి దిగిపోయింది.

వారికి ధీటుగా…..

ఇక తెలుగు రాజకీయాల్లో చూసుకుంటే ప్రాంతీయ పార్టీల హవా బలంగా ఉంది. 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలించినా మళ్ళీ తెలంగాణాలో, ఏపీలో కూడా టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అక్కడ మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో వైసీపీ విజయఢంకా మోగించింది. జనాకర్షణలో కేసీఆర్ .జగన్ మించిన వారులేరు. రాజకీయ చతురత వ్యూహాల్లో చంద్రబాబుకు సాటి కూడా లేరు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులైన ఈ ముగ్గురిని ఢీ కొట్టడం అంటే కుదిరే పని కాదు, కనీసం పక్కన నిలిచేందుకు కూడా బీజేపీలో పెద్ద తలకాయలు ఒకటీ లేవనే చెప్పాలి. తెలంగాణాలో కిషన్ రెడ్డిని కేంద్రమంత్రిని చేసినా ఆయన గ్లామర్ అర్బన్ ఏరియాలకే పరిమితం. ఇక అక్కడ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా జనాకర్షణ కలిగిన నేత కాదు.

నాయకులు కావాలి….

బీజేపీ అన్నీ చూసుకుంటుంది. కేంద్రం నుంచి గట్టి మద్దతు ఇస్తామంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పగ్గాలు పట్టి నడిపించగలిగిన ధీటైన నాయకత్వం మాత్రం లేదనే చెప్పాలంటున్నారు. సారధిగా గ్లామర్, గ్రామర్ కలిగిన నేత కావాలి. ఏపీలో జగన్, చంద్రబాబుతో సరిసమానంగా ఢీ కొట్టే నాయకుడు బీజేపీకి అర్జంట్ గా కావాలి. అందుకోసం ఎంత సెర్చ్ చేసినా కూడా బీజేపీకి ఎవరూ చిక్కడంలేదు. తెలంగాణాలో కనీసం కిషన్ రెడ్డి లాంటి వారు ఉన్నారు. ఏపీలో ఆ స్థాయి నాయకులు కూడా లేరని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి ఎంతమంది నాయకులను రప్పించినా జనంలో పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఫోకస్ చేసే ఫేస్ కావాలి. అదే ఇపుడు బీజేపీ ఆరాటం. మరి అది జరిగే పనేనా.

Tags:    

Similar News