అవే పాలు అవే నీళ్లా?

ఓ వాట్సాప్ గ్రూప్ లో ఫలానా ఛానల్ లో ఉద్యోగి కొత్త ఇంటి ఫోటోలు అంటూ ఓ విశాలమైన ఫామ్ హౌస్ హౌస్ దృశ్యాలు ఉదయం నుంచి [more]

Update: 2020-02-17 18:29 GMT

ఓ వాట్సాప్ గ్రూప్ లో ఫలానా ఛానల్ లో ఉద్యోగి కొత్త ఇంటి ఫోటోలు అంటూ ఓ విశాలమైన ఫామ్ హౌస్ హౌస్ దృశ్యాలు ఉదయం నుంచి చక్కర్లు కొడుతున్నాయి. చూడగానే వరికైనా కన్ను కుట్టేలా ఉన్న ఆ ఫోటోలు నిజమో కాదో కాసేపు అర్థం కాలేదు. చూడబోతే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇల్లులా ఉన్నా ఒకరిద్దరు ప్రత్యక్షంగా తిలకించిన వాళ్ళు నిజమే అని నిర్దారణ చేయగానే దాని యజమాని మీద జాలి కలిగింది.

అన్ని వ్యాపారాలు కలసి వచ్చినా….

పాల నుంచి నీళ్ళని వేరు చేయగల శక్తి ఓ పక్షకి మాత్రమే ఉందని నమ్మిన ఒకాయన మీడియా మార్కెట్లో తన సత్తా చాటుకోడానికి ఓ కాల్పనిక పక్షి ప్రేరణతో దశాబ్దం క్రితం మార్కెట్లోకి వచ్చాడు. మొదట టీవీ, తర్వాత ప్రింట్ ఇలా జేబులో డబ్బుకు వెనకడకుండా, చిట్ల వ్యాపారం, రియల్ ఎస్టేట్, ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలా రకరకాల వ్యాపారాల్లో బాగా ఎదిగినా తర్వాత తన వ్యాపార సామ్రాజ్యానికి మీడియా ఓ రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది అనే సదుద్దేశంతో, జనోద్ధరణకు మేము సైతం అంటూ వేగంగా దూసుకొచ్చాడు. ఆయనకు ఈ ఆలోచన ఎవరిచ్చారో కానీ అప్పటి నుంచి తన శక్తి కొద్ది సంపాదించింది మొత్తం దానికి ధార పోస్తూనే ఉన్నాడు. ఇదిగో, అదిగో బ్రేక్ ఈవెన్ అతిపోతుంది, ఇక డబ్బులు లెక్కపెట్టుకోవడమే మీ వంతు అని చెబుతుంటే నిజమే అనుకోవడం తప్ప ఈ పుష్కర కాలంలో ఆయన ఏమి చేయలేకపోయాడు. మార్కెట్ రేటింగ్ లలో ఎప్పుడూ చివరి నుంచి మొదటి స్థానం తప్ప టాప్ పొజిషన్ కి వెళ్లలేక పోయినా దానిని సరిదిద్దు కోలేకపోవడం విషాదం. మొదలు పెట్టిన ఏ వ్యాపారాన్ని మధ్యలో వదిలేయకూడదు అనే సెంటిమెంట్ ఇంతకాలంగా ఆయన కొంప ముంచుతోంది.

పుష్కర కాలంగా నిలబడే ప్రయత్నాల్లోనే….

ఆ ఛానల్ పెట్టినప్పుడు 50-60 కోట్లు ఖర్చు చేశామని గొప్పగా చెప్పుకుంటే, ఊరు చివర ఆఫీస్ పెట్టి వేయి కోట్లు ఖర్చు చేసినా ఏమి లాభం అని మిగతా వాళ్ళు ఎకసెక్కాలు ఆడారు. దీంతో ఊరి మధ్యలో మరో ఆఫీస్ పెట్టి మేము ఎక్కడ తగ్గేది లేదని బిల్డప్ ఇచ్చారు. 2013 జనవరిలో అనుకుంటా ఛానల్ ఓనర్ వియ్యంకుడు, ఊరి చివర ఆఫీస్ లో జెండా ఎగర వేయడానికి వచ్చి ఉద్యోగుల ముందు బోరు మన్నాడు. తమకున్న వ్యాపారాలు అన్నింట్లో ఉద్యోగులకు బోనస్ లు ఇవ్వడం అలవాటు అని, ఒక్క మీడియాలో మాత్రమే పోగొట్టుకున్న డబ్బు 100కోట్లు దాటేసిందని బావురుమన్నాడు. ఉద్యోగులకు బోనస్ లు ఇద్దమనుకున్నా పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకు కారణం ఎవరో ఉద్యోగులకు అందరికి తెలుసని వాపోయాడు. అప్పటికే ఆ ఆఫీస్ లో బోలెడు గుసగుసలు.

ఎందరు మారినా?

ఆ తర్వాత మెల్లగా ఆ బాతుని రివ్వున గాల్లో ఎగరేస్తానంటూ ఇంకో తల కాయ అందులోకి ప్రవేశించింది. ఆ తర్వాత వచ్చిన రెండో కృష్ణుడు పాత ఉద్యోగుల్ని చెల్ల చెదురు చేసేసి., దానిని సర్వ భ్రష్టం చేసేసి మాయం అయిపోయాడు. దాని గొంతు నులిమేయడంలో భాగంగా ఆ డ్రామా నడిచిందని చెబుతారు. ముచ్చటగా మూడో కృష్ణుడు ఎంట్రీ ఇచ్చి ., యజమాని బలహీనత తెలిసి మొదటి రోజు నుంచి అదే చివరి రోజులా కష్ట పడటం ప్రారంభించాడు. మొత్తం మీద కాల్పనిక భావనలతో మీడియా మొఘల్ అవుదాం అనుకున్న శాల్తీకి మాత్రం కళ్ళ వెంట నీళ్లు కూడా రానంత నిర్లిప్తత….. ఆయనకు అంతే ప్రాప్తం కాబోలు.

Tags:    

Similar News