బత్యాల బరి వదిలేశారా?

బ‌త్యాల చంగ‌ల్రాయుడు. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాకు చెందిన నేత‌ల్లో ఎలాంటి వివాదాలూ లేని నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. [more]

Update: 2019-12-01 11:00 GMT

బ‌త్యాల చంగ‌ల్రాయుడు. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కుడు. ముఖ్యంగా క‌డ‌ప జిల్లాకు చెందిన నేత‌ల్లో ఎలాంటి వివాదాలూ లేని నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు పొందారు. పైగా వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో బ‌లిజ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డంతో వైఎస్ కూడా ఆయ‌న‌ను బాగానే ప్రోత్సహించారు. ఈ క్రమంలో రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. బ‌లిజ సామాజిక వ‌ర్గం మొత్తం ఆయ‌న క‌నుస‌న్నల్లో న‌డిచేద‌నే పేరుకూడా తెచ్చుకున్నారు. క‌డ‌ప జిల్లాలో బ‌లిజ సామాజిక వ‌ర్గంలో మాజీ మంత్రి రామ‌చంద్రయ్య త‌ర్వాత ఆ రేంజ్‌లో ఎదిగిన వ్యక్తి బ‌త్యాల చంగ‌ల్రాయుడే.

రాష్ట్ర విభజన తర్వాత కూడా…..

అయితే, రైల్వేకోడూరు నియోజ‌క‌వ‌ర్గం రిజ‌ర్వ్ కావ‌డంతో త‌న‌కు క‌నీసం రాజంపేట టికెట్ ఇవ్వాల‌ని వైఎస్‌కు మొర‌పెట్టుకున్నారు. కానీ, రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో వైఎస్ బ‌త్యాల చంగ‌ల్రాయుడుకు టికెట్ ఇవ్వలేదు. రాజంపేట‌తో పాటు ప‌క్కనే ఉన్న రాయ‌చోటి ఎప్పుడూ రెడ్డి వ‌ర్గానికే ఇస్తూ వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ త‌ర‌ఫున ఎమ్మెల్సీ గా ఎంపిక చేశారు. మంచి వాయిస్ ఉండ‌డం, మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉండ‌డంతో బ‌త్యాల చంగ‌ల్రాయుడు కాంగ్రెస్‌కు మంచి ప్లస్ అయ్యారు. ఇక‌, వైఎస్ మ‌ర‌ణం, త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఎంద‌రో నాయ‌కులు పార్టీ మారిపోయారు. కానీ, విభ‌జ‌న త‌ర్వాత కూడా బ‌త్యాల చంగ‌ల్రాయుడు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఇక‌, ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ మ‌రింత బ‌ల‌హీన ప‌డింది.

వైసీపీ ఆఫర్ ఇచ్చినా…

దీంతో బ‌త్యాల చంగ‌ల్రాయుడు పార్టీ మారాల‌నిప్ర‌య‌త్నించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం మ‌ళ్లీ వ‌స్తుంద‌నే ధీమా ఏర్పడ‌డంతో బ‌త్యాల చంగ‌ల్రాయుడు జ‌గ‌న్ ఆఫ‌ర్‌ను కాద‌ని, తాను ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్న రాజంపేట టికెట్ ఇస్తాన‌న్న బాబుకు జై కొట్టారు. టీడీపీలో చేరిపోయారు. ఈ క్రమంలోనే బాబు బ‌త్యాల చంగ‌ల్రాయుడుకు రాజంపేట టికెట్ ఇచ్చారు. అంతేకాదు, బ‌త్యాల‌కు ప‌ట్టున్న రైల్వే కోడూరులోనూ విజ‌యం సాధించ‌వ‌చ్చని ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే, జ‌గ‌న్ సునామీ ముందు.. బాబు ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో రెండు చోట్లా సైకిల్ చ‌తికిల‌ప‌డింది.

పార్టీకి దూరంగా…..

దీంతో బ‌త్యాల చంగ‌ల్రాయుడుకు ఫ్యూచ‌ర్‌పై ఆశ‌లు స‌న్నగిల్లాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తిరుప‌తి లో వ్యాపారాలు చేసుకుంటున్నార‌ని తెలిసింది. ఇప్పుడు అస‌లు ఆయ‌న రైల్వేకోడూరు, రాజంపేట నియోజ‌క‌వ‌ర్గాల వైపు తొంగి చూడ‌డం లేదు. అస‌లు ఆయ‌న టీడీపీ ఉన్నారా ? లేరా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. అలాకాకుండా కొంచెం లాజిక్‌గా అడుగులు వేసి ఉంటే.. వైసీపీ నుంచి ఆఫ‌ర్ ఇచ్చిన‌ప్పుడు వెళ్లిపోయి ఉంటే.. జ‌గ‌న్ సునామీ స‌హా త‌న హ‌వాతో గెలుపు గుర్రం ఎక్కేవారు. కానీ, ఆయ‌న వేసిన రాంగ్ స్టెప్ ఆయ‌న‌కు ఫ్యూచ‌ర్ లేకుండా చేసింది. మరి మున్ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News