గ్రేటర్ పై బండి ఫ్యూచర్ ప్లాన్ ఇదే

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి ఎన్నికలు జరుగుతుండటంతో బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ిగ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని నిర్ణయించారు. గ్రేటర్ [more]

Update: 2020-09-27 09:30 GMT

పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలి ఎన్నికలు జరుగుతుండటంతో బండి సంజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ిగ్రేటర్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలని నిర్ణయించారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని దక్కించుకుని అధికార పార్టీకి సవాల్ విసరాలని యోచిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి భవిష్యత్ లో పార్టీకి ఎదురు లేకుండా చేయడంతో పాటు, కాంగ్రెస్ ను వెనక్కు నెట్టాలన్నది బండి సంజయ్ ఆలోచనగా ఉంది.

సర్వే ద్వారా అభ్యర్థుల ఎంపిక….

గ్రేటర్ ఎన్నికల కోసం బండి సంజయ్ కసరత్తులు ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక సర్వే ద్వారా చేయాలని నిర్ణయించారు. ఇండిపెండెంట్ సంస్థ చేత సర్వే చేయించి అభ్యర్థులను నిర్ణయించాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ముందుగా ప్రతి వార్డుకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను రెడీ చేయాలని నేతలకు సూచించారు. ఈ ముగ్గురు పేర్లతో వార్డు వారీగా సర్వే చేయించి అభ్యర్థులను ఎంపిక చేయాలన్నది బండి సంజయ్ లక్ష్యంగా కన్పిస్తుంది.

పాదయాత్రతో ప్రజల ముందుకు…..

దీనికంటే ముందు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి వార్డులో పాదయాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. ఇందుకోసం వార్డుల వారీగా రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలని నేతలను బండి సంజయ్ ఆదేశించారు. పార్లమెంటు సమావేశాల తర్వాత బండి సంజయ్ హైదరాబాద్ లో పాదయాత్ర చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో టార్గెట్ చేయాలని ఆయన భావిస్తున్నారు.

కార్పొరేటర్ల అవినీతిని……

పాదయాత్రలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు అధికార పార్టీ వైఫల్యాలను కూడా ఎండగట్టనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ల అవినీతిపై కూడా ఆరా తీసి వాటిని ప్రజల ముందు ఉంచాలన్నది బండి సంజయ్ ప్లాన్ గా కన్పిస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ డివిజన్ స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. మొత్తం మీద బండి సంజయ్ వ్యూహాలు గ్రేటర్ ఎన్నికల్లో ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News