కొత్త టీంతో వచ్చేస్తున్నారా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి వందరోజులు కావస్తుంది. దీంతో బండి సంజయ్ కొత్త టీం ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు [more]

Update: 2020-06-28 09:30 GMT

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి వందరోజులు కావస్తుంది. దీంతో బండి సంజయ్ కొత్త టీం ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు కూడా పూర్తి చేశారు. త్వరలోనే కొత్త టీంను బండి సంజయ్ ప్రకటిస్తారని తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం ఆమోదం పొందిన తర్వాత కొత్త వారికి బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో బండి సంజయ్ ఉన్నారు.

వెసులుబాటు ఉండటంతో…..

తెలంగాణలో అధ్యక్షుడు మారారు. అయితే పాత టీం మాత్రమే కొనసాగుతుంది. కొత్తగా బాధ్యతలను చేపట్టిన అధ్యక్షుడు బండి సంజయ్ కొత్త టీంతో ముందుకువెళ్లాలని నిర్యించారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో పార్టీలో న్యూలుక్ తీసుకువచ్చేందుకు ఆయన రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. మరి కొద్దిరోజుల్లోనే బండి సంజయ్ ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి టీంను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు బీజేపీలో ఉంది.

అన్ని అనుబంధ సంఘాలను…

దీంతో పార్టీ పెద్దలతో పాటు సంఘ్ నేతలతో పలు దఫాలు బండి సంజయ్ చర్చించారని చెబుతున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో అనేక కమిటీలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే ఈ కమిటీలన్నింటినీ ప్రక్షాళన చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. కోర్ కమిటీలో మొత్తం 28 సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. ఈ సంఖ్యను 20కి కుదించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అలాగే ఉపాధ్యక్షులను పది మంది నుంచి ఏగుడురికి, కార్యదర్శులను పది మంది నుంచి ఐదుగురికి కుదించనున్నారు. వీరితో పాటు అధికార ప్రతినిధులను కూడా మార్చనున్నారు.

కొత్తగా చేరిన వారికి ఛాన్స్…..

ఇక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, పార్టీకి అనుబంధంగా ఉండే విభాగాలను కూడా మార్చాలని బండి సంజయ్ నిర్ణయించారు. దాదాపు 30 విభాగాలకు సంబంధించి కొత్త వారిని నియమించాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. వీరితో పాటు పార్టీ అనుబంధ సంఘాలైన యువ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా, మ‌హిళా మోర్చా, ఓబీసీ మోర్చా, మైనార్టీ మోర్చా ల‌కు నూతన అధ్యక్షులను ఎంపిక చేశారని తెలుస్తోంది. పార్టీలోకి కొత్తగా వ‌చ్చిన వారికి బాధ్యత‌లు అప్పగించారని చెబుతున్నారు. మొత్తం మీద న్యూ లుక్ తో రావాలని బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్ లో ఏమేరకు ఉపయోగపడతాయో చూడాలి.

Tags:    

Similar News