బండికి బ్రేకులు వేశారు.. కారణమిదేనా?

మొత్తానికి ఏడాది నుంచి బండి సంజయ్ ను పట్టుకోలేకపోతున్నాం. గోల్కొండ మీద జెండా ఎగరేస్తామంటారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామంటారు. తామే అసలైన ప్రత్యామ్నాయమని పదే పదే [more]

Update: 2021-04-03 09:30 GMT

మొత్తానికి ఏడాది నుంచి బండి సంజయ్ ను పట్టుకోలేకపోతున్నాం. గోల్కొండ మీద జెండా ఎగరేస్తామంటారు. కేసీఆర్ ను జైలుకు పంపుతామంటారు. తామే అసలైన ప్రత్యామ్నాయమని పదే పదే చెబుతారు. ఇక కేసీఆర్ జమానా ముగిసినట్లేనంటారు. బండియుగం ముందుందటారు. ఇవన్నీ దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే. మితిమీరిన విశ్వాసంతో ఏ ఎన్నిక జరిగినా తమదే విజయం అని బండి సంజయ్ పదే పదే చెబుతారు.

రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో…..

కానీ రెండు ఎన్నికలు బండి సంజయ్ స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. కొద్దిగా బలమున్న హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇది బీజేపీ సిట్టింగ్ స్థానం. ఇది కోల్పోవడమూ బీజేపీకి ఎదురుదెబ్బేనని చెప్పాలి. ఇక వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఐదో స్థానంలో బీజేపీ నిలిచింది.

అదొక్కటే గట్టెక్కిస్తుందా?

కేవలం హిందుత్వ నినాదంతోనే బండిసంజయ్ పార్టీని ముందుకు తీసుకెళ్దామనుకుంటే కుదరదని తేల్చి చెప్పారు గ్రాడ్యుయేట్లు. దుబ్బాక పరిస్థిితి వేరు. అక్కడ పార్టీ అభ్యర్థి వ్యక్తిగత బలమే గెలిపించింది. ఇక హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో హిందుత్వ నినాదం పనిచేసింది. అన్ని ఎన్నికల్లో అది వర్క్ అవుట్ అవ్వదని బండి సంజయ్ గ్రహించాల్సి ఉంటుంది. కేసీఆర్ ను దూషించినంత మాత్రాన నాయకత్వమని పించుకోదని తెలుసుకోవాలి.

సాగర్ పైనా ఆశల్లేవ్…..

ఇక రానురాను బండి సంజయ్ కు పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బీజేపీ మూడోస్థానానికే పరిమితం కావచ్చు. అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ బలంగా ఉన్నాయి. సాగర్ లో బీజేపీ ఫార్ములా పనిచేయదు. కేవలం హిందుత్వ కార్డే సరిపోదు. కేంద్రంలో ఉన్న తమవారు తీసుకుంటున్న నిర్ణయాలకు కూడా ప్రజలు ఈ విధంగా స్పందిస్తారన్నది ఇక్కడి బీజేపీ నేతలు తెలుసుకోవాలి. మోదీ మొండి నిర్ణయాలు ఇక్కడ బీజేపీ బండి ముందుకు సాగదనడానికి ఈ రెండు ఎన్నికలే ఉదాహరణగా చెప్పాలి.

Tags:    

Similar News