రెక్కల కష్టమేనట… వాలిపోయే వారసలు వద్దట

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత కుదుటపడిందనే చెప్పాలి. బీజేపీ పెద్దగా పుంజుకోక పోవడమే ఇందుకు కారణం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఎన్నికల యుద్ధం [more]

Update: 2020-05-30 09:30 GMT

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కొంత కుదుటపడిందనే చెప్పాలి. బీజేపీ పెద్దగా పుంజుకోక పోవడమే ఇందుకు కారణం. తెలంగాణలో అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుంది. గత రెండు ఎన్నికలు చూసినా కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. బీజేపీ ఎన్నికల సమయానికి నీరసపడటం తప్ప సాధించేదేమీ లేదు. గత శాసనసభ ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ, పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి నాలుగు స్థానాలను దక్కించుకుంది.

శాసనసభ ఎన్నికల తర్వాత…..

మోదీ ఆకర్షణ పడకుండా అందుకే కేసీఆర్ శాసనసభకు ముందస్తు ఎన్నికలకు వెళ్లారంటారు. ఇదిలా ఉంటే శాసనసభ ఎన్నికలకు ముందు కూడా కాంగ్రెస్ నుంచి బీజేపీకి పెద్ద యెత్తున వలసలు జరిగాయి. కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేతలు బీజేపీ లో చేరడానికే మొగ్గు చూపారు. ఒక దశలో కాంగ్రెస్ కూడా ఆందోళనకు గురయింది. అయితే శాసనసభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరికలు పూర్తిగా నిలిచిపోయాయి.

బండి సంజయ్ నియామకంతో….

దీంతో పాటు ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియమితులయ్యారు. బండి సంజయ్ అందరినీ కలుపుకునే పోయే మనస్తత్వం అయినప్పటికీ ఆర్ఎఎస్ఎస్ నేపథ్యంతో ఆయన ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరని అంటున్నారు. ఉన్న చోట నుంచి నేతలను తయారు చేయాలన్నది బండి సంజయ్ ఆలోచనగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ కోసం సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలను గుర్తించి వారికి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించాలని బండి సంజయ్ భావిస్తున్నారని తెలుస్తోంది.

వలసలకు బ్రేక్ పడినట్లేనా?

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల వల్ల ఓట్లు రాకపోగా, పార్టీపై ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడుతుందని, అది అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా చూపించిందని బండి సంజయ్ సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలు భవిష్యత్తులో బీజేపీలో పెద్దగా కన్పించకపోవచ్చు. అంతేకాకుండా వారికి పెద్దగా ప్రయారిటీ కూడా ఉండదని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. సొంత కష్టంతోనే ఎదగాలన్నది కొత్త బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆలోచనగా ఉంది. మరి ఇది కాంగ్రెస్ కు మంచిదేగా?

Tags:    

Similar News