సహకారం ఉంటుందా? సక్సెస్ అవుతారా?

పదవి వచ్చిందని సంతోష పడగానే సరిపోదు. సమర్థతను నిరూపించుకోవాలి. నాయకత్వంపై నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే నాయకత్వం పట్ల క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణ [more]

Update: 2020-09-17 09:30 GMT

పదవి వచ్చిందని సంతోష పడగానే సరిపోదు. సమర్థతను నిరూపించుకోవాలి. నాయకత్వంపై నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడే నాయకత్వం పట్ల క్యాడర్ లోనూ, ప్రజల్లోనూ నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు అదే సమస్య తలెత్తింది. అసలే రాష్ట్ర పార్టీ కార్యవర్గం కూర్పుతో సీనియర్ నేతలతో బండి సంజయ్ విభేదాలు కొని తెచ్చుకున్నారు. ఈ సమయంలో వరస ఎన్నికలు బండి సంజయ్ ను ఇబ్బంది పెట్టనున్నాయి.

సీనియర్లలో అసంతృప్తి…..

బండి సంజయ్ పార్టీ బాధ్యతలు చేపట్టి నెలలు మాత్రమే దాటింది. కరోనాతో ఆయన ప్రజల్లో ఎక్కువగా తిరగలేకపోతున్నారు. కరీంనగర్ లోనే ఎక్కువగా ఉంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. మరోవైపు సీనియర్ నేతలు ఆయనకు సహకరించడం లేదు. రాష్ట్ర కార్యవర్గం కూర్పులో తమ సిఫార్సులను పట్టించుకోలేదని గుర్రుగా ఉన్నారు. బయటకు అదేం లేదని చెబుతున్నా సంజయ్ ఈ పదవికి సరిపోడన్న వ్యాఖ్యలు తమ సన్నిహితుల వద్ద చేస్తున్నారు.

వరస ఎన్నికలతో…..

దీనికి తోడు ఇప్పుడు తెలంగాణలో వరస ఎన్నికలు వస్తున్నాయి. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు, ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. ఉప ఎన్నికలో గెలవడం కష్టమే. దుబ్బాకలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించిది. అయితే గెలవడం కష్టమని అందరికీ తెలుసు. కానీ గౌరవప్రదమైన స్కోరు సాధిస్తారా? లేదా? అన్నది ఇప్పడు బండి సంజయ్ ముందున్న ప్రశ్న.

సక్సెస్ అవుతారా?

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం బీజేపీ సిట్టింగ్ దే. ఇక్కడ రామచంద్రరావు ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ గెలవకుంటే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో కూడా సత్తాను చాటాల్సి ఉంటుంది. దీనికి తోడు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నయి. మొత్తం 150 వార్డుల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. మేయర్ స్థానం దక్కించుకోకపోయినా, ప్రతిపక్ష హోదాను దక్కించుకుంటే బండి సంజయ్ సక్సెస్ అయినట్లే. అయితే బండి సంజయ్ కు సీనియర్ నేతలు ఏ మేరకు సహకరిస్తారన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News