మళ్లీ ఆశలు రేగుతున్నాయా?

యువనేత, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు బాల్కసుమన్ కు మంత్రి పదవి దక్కనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేసీఆర్్ మీద ఈగవాలనివ్వని బాల్క సుమన్ కు ఈసారి మంత్రి [more]

Update: 2020-02-11 09:30 GMT

యువనేత, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు బాల్కసుమన్ కు మంత్రి పదవి దక్కనుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేసీఆర్్ మీద ఈగవాలనివ్వని బాల్క సుమన్ కు ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అని అంటున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కేసీఆర్, కేటీఆర్ లతో మంచి సంబంధాలుండటమే కాకుండా కుటుంబ సభ్యుడిగా కూడా బాల్క సుమన్ ను పార్టీ నేతలు చూస్తుంటారు.

మొన్నటి విస్తరణలోనే…..

నిజానికి మొన్నటి విస్తరణలోనే బాల్క సుమన్ కు మంత్రి పదవి దక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిందని చెబుతున్నారు.తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నేతగా బాల్క సుమన్ కీలక పాత్ర పోషించారు. అప్పుడే కేసీఆర్ దృష్టిలో పడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత బాల్కసుమన్ ను అనూహ్యంగా పెద్దపల్లి పార్లమెంటుటిక్కెట్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ పై గెలిచి రికార్డు సృష్టించాడు బాల్క సుమన్.

మున్సిపల్ ఎన్నికల్లో…..

2018 లో జరిగిన ఎన్నికల్లో బాల్క సుమన్ కు కేసీఆర్ చెన్నూరు టిక్కెట్ ఇచ్చారు. అక్కడ సీనియర్ నేత నల్లాల ఓదేలు ఉన్నప్పటికీ ఆయనను కాదని బాల్క సుమన్ కు టిక్కెట్ కేటాయిచడం అప్పట్లోనే పార్టీలో విస్తృత చర్చ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు వ్యతిరేకించినా అధిష్టానం ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన నియోజకవర్గం పరిధిలో స్వీప్ చేసేశారు.

అంత పెద్ద జిల్లాకు ఒక్కరే…..

అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఇంద్రకిరణ్ రెడ్డి మాత్రమే మంత్రిగా ఉన్నారు. పెద్ద జిల్లా కావడంతో మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని కేసీఆర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అందుకే ఈసారి విస్తరణలో బాల్క సుమన్ కు మంత్రి పదవి ఖాయమన్న చర్చ పార్టీలో నడుస్తుంది. దీంతోపాటు కేటీఆర్ కు ముఖ్యమైన పదవి దక్కుతుండటంతో బాల్క సుమన్ ను కూడా మంత్రి వర్గంలోకి తీసుకురావాలన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద బాల్క సుమన్ చిరకాల కోరిక నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News