ఈ ఎంపీ కేరాఫ్ ఢిల్లీయేనా.. వైసీపీలో కీల‌క బాధ్యత‌లు?

వైసీపీ ఎంపీల్లో అంద‌రూ ఖాళీగా లేరు. అంటే.. ఎవ‌రి బిజినెస్‌ల‌లో వారు ఉన్నారా ? అంటే.. అలా కూడా లేదు. ఎందుకంటే.. గెలిచిన వారిలో సగం మంది.. [more]

Update: 2021-05-09 05:00 GMT

వైసీపీ ఎంపీల్లో అంద‌రూ ఖాళీగా లేరు. అంటే.. ఎవ‌రి బిజినెస్‌ల‌లో వారు ఉన్నారా ? అంటే.. అలా కూడా లేదు. ఎందుకంటే.. గెలిచిన వారిలో సగం మంది.. కొత్తముఖాలే. సో.. వారికి అప్పుడే బిజినెస్‌ల‌పై అంత వ్యూహం లేదు. అయినా.. అంద‌రూ బిజీగానే ఉన్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. జ‌గ‌న్ ఒక్కొక్కరికీ ఒక్కొక్క ప‌ని అప్పగించారు. కొంద‌రిని మాత్రం ప‌క్కన పెట్టారు. ఇలా.. కీల‌క‌మైన బాధ్యత‌లు అప్ప‌గించిన వారిలో ముగ్గురు ఎంపీలు ముఖ్యంగా క‌నిపిస్తున్నారు. గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు, రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్‌, కృష్ణాజిల్లా మ‌చిలీప‌ట్నం ఎంపీ బాల‌శౌరిల‌కు జ‌గ‌న్ ఢిల్లీలో మంచి బాధ్యత‌లు అప్పగించారు.

అప్పడప్పుడు తాడేపల్లికి….

అయితే.. వీరిలో ఇద్రు మాత్రం.. అటు ఆ బాధ్యత‌లు చూస్తూనే.. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. న‌ర‌సారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు, రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ ఇద్దరూ తొలిసారి ఎంపీలు అయ్యారు. వీరు స్థానిక రాజ‌కీయాల్లో తిరుగులేని ప‌ట్టు సాధిస్తుండ‌డంతో పాటు వ్యక్తిగ‌త ఇమేజ్ పెంచుకుంటున్నారు. కానీ, మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి మాత్రం డిఫ‌రెంట్‌గా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న‌కు పెట్టుబ‌డుల‌కు సంబంధించి.. కేంద్రం నుంచి అనుమ‌తులు.. విదేశీ ప్రయాణాలు.. వంటి బాధ్యత‌ల‌ను దీంతో బాల‌శౌరి ఎప్పుడైనా ప‌ని ఉంటే త‌ప్ప.. తాడేప‌ల్లికి వ‌స్తున్నారు. లేక‌పోతే.. ఢిల్లీలోనే ఉంటున్నార‌ని.. నియోజ‌కవ‌ర్గంలో టాక్ న‌డుస్తోంది.

నియోజకవర్గానికి దూరమై…?

ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు అంద‌రూ సీనియ‌ర్‌లు కావ‌డం, దీనికితోడు.. మంత్రులు కూడా ఉండ‌డంతో బాల‌శౌరికి పెద్దగా ప‌నిలేకుండా పోయింద‌ని అంటున్నారు. విచిత్రం ఏంటంటే బాల‌శౌరి నియోజ‌క‌వ‌ర్గంలో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే ప్రజ‌ల సమస్యలను పరిష్కరించడానికి ఎమ్మెల్యేలు తమ అనుచ‌రుల‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఆయ‌న మ‌చిలీప‌ట్నం పార్లమెంటు ప‌రిధిలో చేసేదేం లేకుండా పోయింది. అయితే.. ప్రజ‌ల మ‌ధ్య మాత్రం మా ఎంపీని చూసి చాన్నాళ్లయింది ? అన్న టాక్ ఎక్కువ వినిపిస్తోంది.

జగన్ దగ్గర మంచి మార్కులు….

ఈ ప‌రిణామాల‌తో ఎంపీ బాల‌శౌరిపై ఏమైనా వ్యతిరేక‌త వ‌స్తోందా ? అనే సందేహాలు సైతం క‌లుగుతున్నాయి. అలాంటిదేమీ లేదు. కానీ.. స్థానికంగా ఒక‌సారి కాక‌పోయినా.. ఒక‌సారైనా .. ఆయ‌న అందుబాటులో ఉండ‌డ‌మో.. ప్రజ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించ‌డ‌మో చేస్తే.. బెట‌ర్ క‌దా.. ఈ త‌ర‌హా ఇబ్బందులు ఉండ‌వు క‌దా ? అని పార్టీ నేత‌లు ఆయ‌న‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు జారీ చేస్తున్నారు. అయితే. ఢిల్లీలోనే త‌న‌కు స‌మ‌యం స‌రిపోతోంద‌ని.. అంటున్నారు బాల‌శౌరి. ప్రస్తుతం జ‌గ‌న్ ద‌గ్గర మంచి మార్కులు, గ్రాఫ్ ఉన్న ఎంపీల్లో ఈయ‌న కూడా ఒక‌రు కావ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News