Badvel : బద్వేలు వల్లనే క్విక్ రియాక్షన్ వచ్చిందా?

బద్వేలు రాజకీయం తెలుగుదేశం పార్టీకి కొంత కలసి వచ్చిందనే చెప్పాలి. బద్వేలులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. వైసీపీ బరిలో ఉంది. విజయం వైసీపీదే. అందులో [more]

Update: 2021-10-21 08:00 GMT

బద్వేలు రాజకీయం తెలుగుదేశం పార్టీకి కొంత కలసి వచ్చిందనే చెప్పాలి. బద్వేలులో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. వైసీపీ బరిలో ఉంది. విజయం వైసీపీదే. అందులో ఇక్కడ ఎంతమాత్రం సందేహం లేదు. మెజారిటీపైనే వైసీపీ దృష్టి పెట్టింది. రెండో స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో వైసీపీని ఓడించకపోయినా బీజేపీ కన్నా ఎక్కువ ఓట్లు సంపాదించాలన్న కసి కాంగ్రెస్ లో కన్పిస్తుంది.

దాడులు కలసి వచ్చాయా?

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై వైసీపీ చేసిన దాడులు ఈ పార్టీలకు కలసి వచ్చాయి. నిజానికి బద్వేలు ఉప ఎన్నిక లేకపోతే ఇంత వేగంగా ఈ పార్టీలు రియాక్ట్ కావు. ఉప ఎన్నికల్లో టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును ఆకట్టుకోవడానికి బీజేపీ, కాంగ్రెస్ లు ప్రయత్నించాయనే చెప్పాలి. కాంగ్రెస్ నేతలు ఏకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని సందర్శించి దాడులు జరిగిన తీరును పరిశీలించారు. ద్వంసమైన ఫర్నీచర్ ను చూశారు.

కొంత ఫలితం కన్పించిందట…..

నిజానికి కాంగ్రెస్ కు అంత అవసరం లేదు. బీజేపీతో కలసి నడవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు పార్టీకి స్టేట్ మెంట్ ద్వారా మద్దతు తెలిపే వీలున్నా పార్టీ కార్యాలయానికి వెళ్లారంటే అందుకు కారణం బద్వేలు ఉప ఎన్నికేనని గుసగుసలు విన్పిస్తున్నాయి. బద్వేలు లో టీడీపీ ఓట్లు బీజేపీకి టర్న్ కాకూడదనే కాంగ్రెస్ నేతలు వెను వెంటనే రియాక్ట్ అయి, టీడీపీకి మద్దతు తెలిపారంటున్నారు. ఈ ప్రయోగం కొంత ఫలితాలనిచ్చిందంటున్నారు.

బీజేపీ ఇన్ ఛార్జి సయితం…

ఇక బీజేపీ కూడా బద్వేలు ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని టీడీపీకి అండగా నిలిచిందంటారు. సాధారణంగా ఈ సంఘటనపై సోము వీర్రాజు స్పందించారు. దాడి ఘటనను ఖండించారు. కానీ పార్టీ ఇన్ ఛార్జి సునీల్ దేవధర్ వైసీపీపై విమర్శలు చేస్తూ, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడాన్ని ఖండించారు. బద్వేలు ఉప ఎన్నిక కారణంగానే ఈ రెండు పార్టీలూ టీడీపీ కార్యాలయంపై దాడులకు వెంటనే స్పందించాయి. కానీ టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్ కు మాత్రం సహకరించలేదు.

Tags:    

Similar News