క‌ల చెదిరింది.. ఆ మాజీ ఎమ్మెల్యే పొలిటిక‌ల్ బత్తాయి?

రాజ‌కీయాల్లో ఎన్నాళ్ల నుంచి ఉన్నామ‌నేది ప్రాధాన్య అంశ‌మే అయిన‌ప్పటికీ.. ల‌క్కు చిక్కి.. గెలుపు గు ర్రం ఎక్కడం, ఎక్కడిక‌క్కడ వ్యూహాత్మకంగా ముందుకు సాగ‌డం కూడా అంతే ముఖ్యం. [more]

Update: 2020-06-03 12:30 GMT

రాజ‌కీయాల్లో ఎన్నాళ్ల నుంచి ఉన్నామ‌నేది ప్రాధాన్య అంశ‌మే అయిన‌ప్పటికీ.. ల‌క్కు చిక్కి.. గెలుపు గు ర్రం ఎక్కడం, ఎక్కడిక‌క్కడ వ్యూహాత్మకంగా ముందుకు సాగ‌డం కూడా అంతే ముఖ్యం. అయితే, ఈ ల‌క్కు విష‌యంలో చాలా మంది వెనుక‌బ‌డుతున్నారు. ప్రజ‌ల్లో అభిమానం ఉన్నప్పటికీ..కూడా ఎన్నిక‌ల గోదాలో విజ‌యతీరం చేర‌లేక పోతున్నారు. ఇక‌, మ‌రికొంద‌రు నాయ‌కులు పార్టీ అధినేతల వ్యూహాల్లో ప‌డి న‌లిగి పోతున్నారు. పార్టీపై అభిమానం ఉన్నప్పటికీ.. అధినేత మాట త‌ప్పడం ఇష్టంలేక వారి ఆదేశాల ప్రకార‌మే న‌డుచుకుంటున్నా.. ఆట‌లో అర‌టిపండు మాదిరిగా మిగిలిపోతున్న ఓ సీనియ‌ర్ నాయకుడు బాచిన చెంచు గ‌ర‌ట‌య్య హిస్టరీనే ఈ స్టోరీ.

అధిష్టానానికి విధేయుడే…

ప్రకాశం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో 1983, 1985, 1994, 1999 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు బాచిన చెంచు గ‌ర‌ట‌య్య. ప్ర‌స్తుతం వ‌యోవృద్ధుడు అయిన‌ప్పటికీ.. ప్ర‌జ‌ల్లో బాగానే ఉంటున్నారు. గ‌త ఏడాది వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసినా రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ క‌నిపించినా బాచిన చెంచు గ‌ర‌ట‌య్య మాత్రం గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. అయితే, ఆయ‌న రాజ‌కీయ జీవితంలో అనేక ఎత్తు ప‌ల్లాలు ఉన్నాయి. ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ అధినేత‌కు క‌ట్టుబ‌డ‌డం బాచిన చెంచు గ‌ర‌ట‌య్యలో ఉన్న ప్రధాన ల‌క్షణం. బాచిన చెంచు గ‌ర‌ట‌య్య రాజ‌కీయ ప్రయాణం 1970ల‌లోనే ప్రారంభ‌మైంది. అప్పట్లో ఆయ‌న జ‌న‌తా పార్టీలో ఉండేవారు.

బాబు దెబ్బకు….

అయితే, అన్నగారు ఎన్‌టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో జ‌న‌తా పార్టీ నుంచి టీడీపీలో చేరిన గ‌ర‌ట‌య్య నాలుగు సార్లు ఇదే పార్టీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. ఇక‌, ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న ఫేట్ మారిపోయింది. చంద్రబాబు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. 2004 ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీగా ఉన్న క‌ర‌ణం బ‌ల‌రామ కృష్ణమూర్తి ఒత్తిడి మేర‌కు ఆయ‌న‌కు అద్దంకి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో గ‌ర‌ట‌య్యను ప‌రుచూరుకు పంపారు. అధిష్టానం ఆదేశాల మేర‌కు గ‌ర‌ట‌య్య అక్కడ‌కు వెళ్లిపోటీ చేశారు. అయితే, ప‌రుచూరులో ఆయ‌న ద‌గ్గుబాటి హ‌వా ముందు గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.

కాంగ్రెస్ లో చేరి….

2009 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి గ‌ర‌ట‌య్య టీడీపీలోనే ఉన్నారు. అయితే, 2009లో చేప‌ట్టిన నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న‌లో తూర్పు ప్రకాశంలో అద్దంకి, చీరాల‌, మార్టూరుల్లో మార్టూరు ర‌ద్దయింది. దీంతో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఒక‌రిని ప‌క్కన పెట్టాల్సి వ‌స్తే.. చంద్రబాబు క‌నీసం ఆలోచ‌న కూడా లేకుండా గ‌ర‌ట‌య్యను ప‌క్కన పెట్టేశారు. నీకు సీటు లేద‌ని చెప్పేశారు. అప్పటి వ‌ర‌కు టీడీపీలో న‌మ్మిన‌బంటుగా ఉన్న గ‌ర‌ట‌య్య సీటు లేద‌న‌డంతో సైకిల్ దిగారు. ఇక‌, ఆ స‌మ‌యంలో కాంగ్రెస్‌లోకి వ‌చ్చారు. వైఎస్‌తో అనుబంధం పెంచుకున్నారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో అద్దంకి నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీకి దిగిన‌ గొట్టిపాటి ర‌విని గెలిపించుకునేలా కృషి చేయాల‌ని వైఎస్ పిలుపునిచ్చారు.

జగన్ టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి…..

ఈ పిలుపుతో గ‌ర‌ట‌య్య గొట్టిపాటి గెలుపున‌కు కృషి చేశారు. త‌ర్వా త ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి వ‌స్తుందని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా వైఎస్ మ‌ర‌ణంతో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారిపోయిం ది. దీంతో కాంగ్రెస్‌ను వీడి 2014లో ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీలోకి వెళ్లారు. అద్దంకి టికెట్ కోసం ప్రయ‌త్నించారు. అయితే, ఎన్నిక‌ల స‌మ‌యానికి కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి ర‌వి(సిట్టింగ్ ఎమ్మెల్యే) వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమై రావ‌డంతో రవికి జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. దీంతో గ‌ర‌ట‌య్య ఆట‌లో అరిటిపండు అయిపోయారు.

ఈసారి పోటీ చేసినా….

అయితే ఇంతా చేసి జ‌గ‌న్ గొట్టిపాటికి టికెట్ ఇస్తే.. ఆయ‌న టీడీపీలోకి జంప్ చేశారు. ఇక‌, అప్పటి వ‌ర‌కు మౌనంగా ఉన్న గ‌ర‌ట‌య్య మ‌ళ్లీ పుంజుకున్నారు. ఇక‌, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గ‌ర‌ట‌య్యకు టికెట్ ఇచ్చారు. అంటే.. 2004 ఎన్నిక‌ల‌ త‌ర్వాత 2019లోనే గ‌ర‌ట‌య్యకు టికెట్ ల‌భించింది. అయితే, అద్దంకిలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి… గ‌ర‌ట‌య్య‌ను వృద్ధుడు అని ప్రచారం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ సునామీ క‌నిపించినా.. గ‌ర‌ట‌య్య గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక‌, ఆ త‌ర్వాత గ‌ర‌ట‌య్య వార‌సుడిగా బాచిన కృష్ణచైత‌న్యకు నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ బాధ్యత‌లు ఇచ్చారు.

అన్ని సార్లూ త్యాగమేనా?

దీంతో ఇక‌, త‌న వార‌సుడైనా అద్దంకిలో రాజ‌కీయంగా స్థిర‌ప‌డ‌తాడు అని గ‌ర‌ట‌య్య అనుకుంటున్న స‌మ‌యంలో మ‌రో సారి కూడా అరిటిపండు అయ్యే ప‌రిస్థితి వెంటాడుతోంది. అదే.. క‌ర‌ణం రూపంలో! 2004 ఎన్నిక‌ల్లో తను ఎవ‌రి మూలంగా అయితే, నియోజ‌క‌వ‌ర్గాన్ని మార్చుకోవాల్సి వ‌చ్చి ఓట‌మి పాల‌య్యారో.. ఆయ‌నే క‌ర‌ణం బ‌ల‌రాం. ఇప్పుడు ఆయ‌న టీడీపీ త‌ర‌ఫున చీరాల నుంచి గెలుపు గుర్రం ఎక్కినా.. వైసీపీకి మ‌ద్దతు దారుగా మారిపోయారు. ఈ క్రమంలోనే త‌న కుమారుడు వెంకటేష్‌కు అద్దంకి నుంచి 2024లో పోటీ చేయించాల‌ని భావిస్తున్నారు. ఇదే క‌నుక వ‌ర్కవుట్ అయితే.. గ‌ర‌ట‌య్య కుమారుడికి టికెట్ ల‌భించే అవ‌కాశం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌ర‌గుతుందో చూడాలి. ఏదేమైనా… న‌మ్మిన పార్టీలో అధినేత ఇష్టానుసారం న‌డిచి.. త‌న పొలిటిక‌ల్ లైఫ్‌ను శాక్రిఫైజ్ చేశార‌నే మాట మాత్రం గ‌ర‌ట‌య్యకు నిలిచిపోతుంద‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News