జూనియర్ అయ్యన్నకు గట్టి ఝలక్ ?

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటే ఫైర్ బ్రాండ్ అని ఎవరైనా చెబుతారు. ఆయన నోరు చాలా పెద్దది. ఆయన నోరు తెరిచారా ఎక్కడ లేని [more]

Update: 2020-11-23 08:00 GMT

విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అంటే ఫైర్ బ్రాండ్ అని ఎవరైనా చెబుతారు. ఆయన నోరు చాలా పెద్దది. ఆయన నోరు తెరిచారా ఎక్కడ లేని విమర్శలు అలా గటగటా వచ్చేస్తాయి. ఆయనది దాదాపుగా నాలుగు దశాబ్దాల రాజకీయం. ఇక అయ్యన్నపాత్రుడు వారసుడిగా కొన్నాళ్ళ క్రితం రంగప్రవేశం చేసిన పెద్ద కొడుకు చింతకాయల విజయ్ పాత్రుడు ఇపుడు వైసీపీకి టార్గెట్ కావడం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయ్ పాత్రుడు అమాయక గిరిజనులను అడ్డం పెట్టుకుని వారిని బినామీలుగా చేసి అక్రమ‌ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అని జిల్లా మైనింగ్ శాఖ అధికారులు తాజాగా గుట్టు తేల్చారు.

ఇలా ఎదిగి అలా….?

విజయ్ పాత్రుడుని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్య్దర్శిగా ఈ మధ్యనే చంద్రబాబు నియమించారు. దాంతో ఆయన నర్శీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అని అపుడే ప్రచారం అయిపోయింది. దాంతో జూనియర్ అయ్యన్నపాత్రుడిదే జిల్లా రాజకీయం అని టీడీపీలో అంతా ఆనందిస్తున్న వేళ అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో ఆయన చిక్కుకోవడం ఇబ్బందికరమే. తూర్పుగోదావరికి చెందిన ఇద్దరు గిరిజనులు పేరు మీద విశాఖ జిల్లాలో మైనింగ్ లీజులను తీసుకుని విజయ్ తానే వాటిని నిర్వహిస్తున్నారు అని మైనింగ్ అధికారులు ఆధారాలు సేకరించారట. ఇక విజయ్ కి బినామీలు అని చెబుతున్న ఆ ఇద్దరు గిరిజనులకు అక్రమ మైనింగ్ చేసినందుకు గానూ 17 కోట్ల రూపాయల భారీ జరీమానా కూడా విధించారు.

దెబ్బేనా ….?

కొడుకు రాజకీయంగా ఎదుగుతున్నాడు అని అయ్యన్నపాత్రుడు సంబరపడినంత సేపు లేదు మరి. విశాఖ జిల్లాలో అక్రమాల మూలాలను ఎక్కడ జరిగినా తవ్వితీసి మరీ వైసీపీ సర్కార్ ఒక్కొటిగా బయట పెడుతోంది. ఇందులో భాగంగానే 2016లో అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉండగా విజయ్ ఇలా బినామీల పేరిట అక్రమ మైనింగ్ వ్యవహారాలకు తెరలేపారని అంటున్నారు. మరి కట్టుకునేందుకు బట్ట,తినడానికి తిండి కూడా లేని ఆ గిరిజనులు 17 కోట్ల జరీమానా ఎలా కట్టగలరు. అసలు మైనింగ్ అన్న మాటకు కూడా వారికి అర్ధాలు తెలియవు. దాంతో తెర వెనక ఉన్న పెద్దల గుట్టు రట్టు చేసే పనిలో మైనింగ్ అధికారులు బిజీగా ఉన్నారట. అదే జరిగితే అయ్యన్నపాత్రుడు కు భారీ దెబ్బేనని అంటున్నారు.

Tags:    

Similar News