అయ్యన్న అంతదాకా తెచ్చుకుంటారా…?

అదేంటో చంద్రబాబు కంటే సీనియర్ ని అని పదే పదే చెప్పుకున్నా కూడా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్కడే ఉండిపోయారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి [more]

Update: 2020-11-03 13:30 GMT

అదేంటో చంద్రబాబు కంటే సీనియర్ ని అని పదే పదే చెప్పుకున్నా కూడా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అక్కడే ఉండిపోయారు. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి కావడం తప్ప ఆయన అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు. అయ్యన్నపాత్రుడు టీడీపీ పుట్టినప్పటి నుంచి ఉన్న పెద్ద మనిషి. పొలిట్ బ్యూరోలో మెంబర్ పదవి తప్ప బాబు ఏమీ ఇవ్వలేకపోతున్నారు. వెనకాల వచ్చిన అచ్చెన్నాయుడు అయినా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు కానీ అయ్యన్నపాత్రుడుకు ఆ భాగ్యం కూడా లేదు. అయినా బాబు భక్తి వీడని అయ్యన్న విశాఖ నుంచి లౌడ్ వాయిస్ తో వైసీపీ సర్కార్ మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. ఏకంగా జగన్నే టార్గెట్ చేస్తున్నారు.

హద్దు దాటేశారు ….

అయ్యన్నపాత్రుడుకు హద్దులు దాటేయడం అలవాటే. ఆయన స్వపక్షం అయినా విపక్షం అయినా ఒకే తీరున రెచ్చిపోతారు. అపుడు ఆయన నోటి వెంట మామూలు భాష రాదు, అధికారులా, పార్టీ నాయకులా అని కూడా చూడకుండా అయ్యన్నపాత్రుడు ఆణిముత్యాలే జాలువారుస్తారు. ఆరు పదులు దాటిన వయసు. సీనియర్ నేతను అని కూడా మరచిపోయి మరీ ఆయన విసురుతున్న మాటలతో అధికారులైతే తీవ్ర అసహనం చెందుతున్నారు. ఆయన ఎంత పెద్ద అధికారులనైనా పట్టుకుని ఏకవచన ప్రయోగం చేయడమే కాకుండా చెప్పడానికి వీలు లేని పదాలనే వాడుతున్నారు అని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గీతం విద్యా సంస్థల ప్రహారీ కూల్చుడు ఎపిసోడ్ లో అయ్యన్నపాత్రుడు అధికారులను పట్టుకుని ఘోరంగా మాట్లాడారు. అవి సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అయ్యాయి కూడా.

లెక్కబెడుతున్నారా….?

అయ్యన్నపాత్రుడు మీద ఇపుడు వైసీపీ టార్గెట్ పెట్టిందని అంటున్నారు. విశాఖ జిల్లాలో అయ్యన్న తప్ప టీడీపీకి వేరే పెద్ద నాయకుడు కూడా లేడు. ఆయన అయితే చాలా సమయంలో బ్యాలన్స్ తప్పేస్తున్నారు. ఆ మధ్యన నర్శీపట్నం మహిళా కమిషనర్ ని దూషించి అరెస్ట్ దాకా కధ సాగినా అయ్యన్న కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుని బయటపడిపోయారు. అయినా అయ్యన్న అసలు వెనక్కి తగ్గకుండా పదే పదే కాని భాషనే వాడుతున్నారు. దాంతో అధికారులు రగిలిపోతున్నారు. మరో వైపు జగన్ని కూడా ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా పరుష పదజాలాన్ని ఆయన ప్రయోగిస్తున్నారు. దీంతో అయ్యన్నపాత్రుడు తప్పులను వరసపెట్టి వైసీపీ పెద్దలు లెక్కబెడుతున్నారని అంటున్నారు. సరైన సమయం చూసి యాక్షన్ లోకి దిగిపోతారా అన్న డౌట్లు అయితే వస్తున్నాయి.

ఇబ్బందేనా …?

దాదాపు ఆరేడు నెలల క్రితం మత్తు డాక్టర్ సుధాకర్ ని అడ్డం పెట్టుకుని అయ్యన్నపాత్రుడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు, ఆయన ప్రభుత్వం మీద జల్లిన బురద కూడా ఎక్కువే. ఇక అది కాస్తా సీబీఐ కేసు దాకా వెళ్ళింది. ఆ తరువాత కూడా జగన్ని టార్గెట్ చేస్తూ పాలన చేతకాదని దారుణంగానే అయ్యన్న మాట్లాడుతున్నారు. మరి అచ్చెన్నాయుడు లాంటి వారినే వదలకుండా అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ ఇపుడు అయ్యన్నపాత్రుడు మీద గురి పెట్టి ఉంచిందని అంటున్నారు. అయ్యన్న కోపంతో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించాల్సిఉంటుందని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఆయ్యన్న కోరి మరీ కొత్త కేసులు తెచ్చుకుంటారా అని తమ్ముళ్ళు కూడా కంగారు పడుతున్నారుట. చూడాలి ఏం జరుగుతుందో

Tags:    

Similar News