అయ్యన్నకు వారసుడొచ్చేశాడు…గంటాకు తంటాయే…!

విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకూ వారిద్దరి మధ్యనే అధికార పార్టీ రాజకీయం అంతా సాగింది. వారే [more]

Update: 2020-11-13 13:30 GMT

విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ఇద్దరు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకూ వారిద్దరి మధ్యనే అధికార పార్టీ రాజకీయం అంతా సాగింది. వారే అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు. చంద్రబాబుని గభాలుగా ఒక మాట అన్నా కూడా ఆయనకు అత్యంత విశ్వసపాత్రుడిగా అయ్యన్నపాత్రుడు ఇప్పటికీ మెలుగుతున్నాడు. నీ కంటే సీనియర్ ని బాబూ అంటూ గట్టిగా గదామాయించేలా ఒక టైమ్ లో మాట్లాడినా బాబు తప్ప ఎవరూ ఏపీకి దిక్కు లేదు అంటూ ఆయింట్మెంట్ పూయగల చాణక్యం అయ్యన్నపాత్రుడుదే, అందుకే అయ్యన్నకు బాబు అలా తాయిలాలు ఇస్తూంటారు.

టికెట్ రెడీనా …..?

ఇక అయ్యన్నపాత్రుడు 2019 ఎన్నికల్లో తాను రిటైర్ అవుతాను అని తన కుమారుడికి నర్శీపట్నం ఎమ్మెల్యే టికెట్ ఇమ్మనమని బాబుని ఒక లెక్కన బతిమాలారు. కానీ బాబు ససేమిరా అనేశారు. కానీ ఇపుడు మాత్రం కోరి మరీ పార్టీ పదవి అందించారు. రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శిగా చింతకాయల విజయ్ ని నియమించారు. దీంతో రానున్న రోజుల్లో విజయ్ కి పార్టీ టికెట్ విషయంలో కచ్చితమైన హామీ లభించింది అనుకోవాలేమో. తాను ఇక పోటీ చేయనని అయ్యన్నపాత్రుడు కూడా అంటున్న వేళ కుమారుడికి పార్టీలో పదవి దక్కడంతో సగం బాధ్యత తీరిందని అంటున్నారు.

రెట్టింపు ఆనందం…..

ఇక టీడీపీలో మరో నేతగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. పైగా ఆయన విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే. కానీ ఆయనకు ఎటువంటి పదవినీ బాబు ఇవ్వలేదు. అంతే కాదు. అయన కుమారుడు కూడా రాజకీయంగా అరంగేట్రం చేయాలని చూస్తున్నారు. మరి కొడుకుకి ఏ పదవీ లేదు ఇది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. ఇక అయ్యన్నపాత్రుడు ఇంట్లో రెండు పార్టీ పదవులు ఉంటే గంటాను బాబు అసలు పట్టించుకోకపోవడంతో చింతకాయల వారి అనుచరులు రెట్టింపు జోష్ తో ఉన్నారట. ఇక తమ నేతదే పెత్తనం అంటున్నారుట.

పగ పట్టారా….?

నిజానికి గంటా అంటే బాబుకు బాగా ఇష్టం అని చెబుతారు. కానీ ఆయన గోడ దూకుళ్ళతో పడలేకనే బాబు దూరం పెడుతున్నారని అంటున్నారు. తాజాగా ఆయన వైసీపీలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు చూసిన మీదటనే బాబు ఆయనను టార్గెట్ చేశారని చెబుతున్నారు. దాదాపుగా పదిహేను వందల వరకూ వివిధ స్థాయిల్లో పార్టీ పదవులు భర్తీ చేసిన బాబుకు గంటాకు, ఆయన కొడుకుకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేసే వీలు లేకపోయిందా అన్న చర్చ అయితే వస్తోంది. ఇన్నాళ్ళకు బాబు గంటా వంటి నేత మీద గట్టిగా పగ పట్టేశారని అంటున్నారు. చూడాలి మరి ఈ పరిణామాలు విశాఖలో ఎటు వైపునకు దారితీస్తాయో.

Tags:    

Similar News