అయోధ్య తేలిపోతుందా….?

అయోధ్యలోని రామాలయ స్థల వివాదం పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీకి మరింత గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి తో ఏర్పాటైన [more]

Update: 2019-05-11 18:29 GMT

అయోధ్యలోని రామాలయ స్థల వివాదం పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీకి మరింత గడువు ఇచ్చింది సుప్రీం కోర్టు. చీఫ్ జస్టిస్ రంజన్ గగోయి తో ఏర్పాటైన ధర్మాసనం ఈమేరకు తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈఏడాది ఆగస్టు 15 వరకు తమ నివేదిక ఇచ్చేందుకు స్థలవివాద పరిష్కార త్రిసభ్య కమిటీ కి వెసులుబాటు కల్పించింది. ఈ కమిటీ మరింత విస్తృతంగా పనిచేసి సామరస్య పూర్వక పరిష్కారాన్ని కనుగొనాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది.

త్రి సభ్య కమిటీ చర్చలు ఫలిస్తాయా …?

అయోధ్య స్థల వివాదానికి సుప్రీం కోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ కలీముల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధినేత ఆధ్యాత్మికవేత్త పండిట్ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీ రామ్ బచ్చు సుప్రీం నియమించిన త్రి సభ్య కమిటీలో సభ్యులు. ఇప్పటికే వీరు వివాద పరిష్కారానికి చూపుతున్న చొరవ ను అంతా అభినందిస్తున్నారు. అయితే తమకు ఈ వ్యవహారంపై నివేదిక ఇచ్చే గడువు మరింత పెంచాలని కమిటీ సుప్రీం కు విన్నవించడంతో కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

మరో ఐదేళ్ల పాటు….

కమిటీ కోర్టు దృష్టికి తెచ్చే అంశాలను రహస్యంగానే ఉంచుతామని బహిర్గత పరచమని స్పష్టం చేసింది. హడావిడిగా ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించే ప్రయత్నం మంచిది కాదనే భావనతోనే కోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు త్రి సభ్య కమిటీ హర్షం వ్యక్తం చేసింది. రామ జన్మభూమి స్థలవివాదం కొలిక్కి వచ్చేలా ఉందని కోర్టు కు విన్నవించడం గమనార్హం. అయితే తక్షణం రామాలయం నిర్మించాలని తొందరపడుతున్న బిజెపికి మాత్రం తాజా పరిణామం షాక్ కి గురిచేసే అంశమే. ఈ నెల 19 న చివరి విడత పోలింగ్ కూడా పూర్తి అయితే మాత్రం మరో ఐదేళ్లపాటు ఎన్నికల ముందు వరకు అయోధ్య వివాదం సాగతీసే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.

Tags:    

Similar News