అవంతి ఆరితేరిపోయిందందుకేనా?

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ కి గట్టి మద్దతుదారులైన మంత్రుల కోటరీలోకి చేరేందుకు బాగానే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ [more]

Update: 2019-12-17 06:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ కి గట్టి మద్దతుదారులైన మంత్రుల కోటరీలోకి చేరేందుకు బాగానే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ శాఖాపరంగా పెద్దగా మార్కులు సంపాదించలేకపోతున్నప్పటికీ రాజకీయ విమర్శలతో బాబుకు ఇరుకున పెట్టడానికి పనికివస్తున్నారని అంటున్నారు. దానికి కారణం ఆయన నిన్నటి వరకూ టీడీపీ ఎంపీగా ఉండడమే. దాంతో ఆసెంబ్లీ లోపలా బయటా బాబు గుట్టుని విప్పుతూ అధినేత జగన్ మెప్పు పొందుతున్నారని చెబుతున్నారు. నిజానికి విశాఖ వంటి పర్యాటకప్రాంతంలో అదే శాఖకు మంత్రిగా ఉన్న అవంతి శ్రీనివాస్ గడచిన అరునెలలుగా తన మంత్రిత్వ శాఖలో ముద్ర వేయలేకపోయారని విమర్శలు ఉన్నాయి.

అసంతృప్తి నుంచి….

దీనిమీద ముఖ్యమంత్రి జగన్ సైతం అనేక సందర్భాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్ పనితీరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. మిగిలిన శాఖల మంత్రులు కొత్త రూట్లో వెళ్తూ ఖజానాకూ ఆదాయాన్ని తెచ్చిపెట్టేలా పధకాలను డిజైన్లు చేస్తూంటే అవంతి శ్రీనివాస్ మాత్రం శాఖాపరంగా పట్టుని సాధించలేకపోతున్నారని అంటున్నారు. విశాఖను టూరిజం హబ్ గా చేయాలని జగన్ సర్కార్ కంకణం కట్టుకున్నా దానికి తగినట్లుగా పెట్టుబడులను ఆకట్టుకోవడం, కొత్త పాలసీలను రూపకల్పన చేయడంతో అవంతి శ్రీనివాస్ బాగా వెనకబడ్డారని అంటున్నారు. ఇక రాజమండ్రి బోటు ప్రమాదం విషయంలో కూడా శాఖాపరమైన నిర్లక్ష్యం ఉందని జగన్ భావిస్తున్నారట. ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయ దూకుడుని కూడా చూపడంలో సైతం మంత్రి అవంతి శ్రీనివాస్ బాగా మైనస్ అంటున్నారు.

ట్రాక్ లోకి వచ్చారా…?

ఇక విశాఖ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా కన్నబాబు వచ్చాక అవంతి శ్రీనివాస్ లో కొత్త జోష్ కనిపిస్తోందని అంటున్నారు. ఇద్దరూ ప్రజారాజ్యం నుచ్ని ఒకే సారి అరంగేట్రం చేయడం. ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో కన్నబాబు నుంచి తగిన గైడెన్స్ అవంతి శ్రీనివాస్ తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహిత మంత్రుల్లో కన్నబాబు ఒకరు. ఆయన సూచనలతో అవంతి శ్రీనివాస్ ట్రాక్ లోకి వస్తున్నారని అంటున్నారు. ఆయన మీద ఉన్న ఫిర్యాదులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ తనదైన రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.

ఆత్మీయ సమావేశంతో….

మంత్రి అయిన అరు నెలల కాలంతో కనీసం జిల్లాలోని ఎమ్మెల్యేలను కలుపుకుని పోని అవంతి శ్రీనివాస్ లో ఒక్కసారి మార్పు రావడం పట్ల సొంత పార్టీలోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అవంతి శ్రీనివాస్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఆత్మీయ‌ విందు ఏర్పాటు చేసి తాను బాగా సన్నిహితం అని చాటుకునే ప్రయత్నం ఒకటి చేశారు. మంత్రిగా తాను అందరి వాడిని అని చెప్పుకుంటున్నారు. ఇది హై కమాండ్ కి వెళ్ళిన ప్రధాన ఆరోపణ కావడంతో అందరితో కలసి ముందుకు సాగుతానని అవంతి శ్రీనివాస్ సంకేతాలు ఇస్తున్నారు. అదే విధంగా అసెంబ్లీ వేదికగా బాబుని తూర్పారా పడుతూ జగన్ మనసు గెలుచుకునేందుకు కూడా గట్టిగానే ట్రై చేస్తున్నారు. జగన్ తలచుకుంటే టీడీపీ ఖాళీ అంటూ సభలో అవంతి శ్రీనివాస్ చేసిన హాట్ కామెంట్స్ ఆయన మారిన శైలికి అద్దం పడుతోందని అంటున్నారు. ఇవన్నీ సరే కానీ మంత్రులకు జగన్ పెట్టిన పరీక్షలో అవంతి శ్రీనివాస్ నెగ్గితేనే భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీని విశాఖలో గెలిపించడం ఆయన ముందున్న బిగ్ టాస్క్ అని చెబుతున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News