అవంతికి స్ట్రాంగ్ వార్నింగ్ అదేనా…?

ఏ ప్రాంతీయ పార్టీ అయినా నాయకులకు చాలా పరిమితులు ఉంటాయి. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యమే కానీ అసలైన అధికారాలు అన్నీ కూడా అధినేతల చేతుల్లో ఉంటాయి. వారు [more]

Update: 2021-03-16 08:00 GMT

ఏ ప్రాంతీయ పార్టీ అయినా నాయకులకు చాలా పరిమితులు ఉంటాయి. అక్కడ పేరుకు ప్రజాస్వామ్యమే కానీ అసలైన అధికారాలు అన్నీ కూడా అధినేతల చేతుల్లో ఉంటాయి. వారు వాటిని తమకు అత్యంత సన్నిహితులు అయిన వారికి కొంత పంచి మొత్తానికి మొత్తం గుప్పిట పెట్టుకుంటారు. అలా కనుక చూస్తే విశాఖలో పేరుకు మంత్రిగానే అవంతి శ్రీనివాసరావు ఉన్నారు. విజయసాయిరెడ్డి టోటల్ గా చక్రం తిప్పేస్తున్నారు. ఆయన వెనక నీడలాగానే మంత్రి అయినా సామంతులైనా నడవాల్సిందే.

జగనే ఫైనల్….

విశాఖలో ఏ పరిణామం జరిగినా జగన్ కి తెలియకుండా ఉండదు, జగన్ వేరు, సాయిరెడ్డి వేరు అని ఎవరైనా భ్రమపడితే వారి రాజకీయ అవగాహన అంతే అని సరిపెట్టుకోవాలి. బాహాటంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని విజయసాయిరెడ్డి ఆహ్వానించారు అంటే దాని వెనక జగన్ ఉన్నాడనే నమ్మాలి. ఇక గంటా కూడా తాను వైసీపీలోకి రాను అని కచ్చితంగా చెప్పడం లేదు. అందువల్ల అది ఇవాళ కాకపోయినా రేపు అయినా జరిగే వ్యవహారమే. మరి ఈ నేపధ్యంలో జగన్ తీసుకునే ఏ నిర్ణయం అయినా అంతా కట్టుబడి ఉండాలని విజయసాయిరెడ్డి హెచ్చరించింది ఎవరి గురించి అని విశాఖ రాజ‌కీయ వర్గాల్లో చర్చకు వస్తోంది.

అలిగినా అంతేగా…..?

విజయసాయిరెడ్డి గంటా సన్నిహితుడు బిల్డర్ అయిన కాశీవిశ్వనాధ్ ని చేర్చుకున్న సందర్భంలో పక్కన ఉండాల్సిన మంత్రి అవంతి శ్రీనివాసరావు లేకుండా పోయారు. ఇది మీడియా దృష్టిని దాటిపోలేదు. అంతే కాదు రాజకీయ వర్గాల్లోనూ కల కలం రేపింది. అయితే వైసీపీ పెద్దలు మాత్రం దీన్ని చాలా లైట్ గా తీసుకున్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంతా ఓకే అనాల్సిందే అంటున్నారు. ఎవరూ కూడా విభేదించరాదు అని కూడా గట్టిగానే విజయసాయిరెడ్డి కాషన్ ఇచ్చేశారు. అలా అవంతి శ్రీనివాసరావు అలిగినా కూడా ఏమీ జరగ‌బోదు అని వైసీపీ పెద్దలు చెప్పేశారు, కుండబద్ధలు కొట్టేశారు.

చతురత ఉంటేనే ….?

రాజకీయాల్లో పదవులు వచ్చినా క్లిక్ కావాలంటే చతురత చాలా అవసరం. మంత్రిగా గంటా శ్రీనివాసరావు జిల్లా మొత్తాన్ని శాసించారు, రాష్ట్రం దృష్టిని కూడా ఆకర్షించారు. ఆయన విజన్ వేరుగా ఉండేది, ఆయన అనుచరుడిగా రాజకీయ ఓనమాలు దిద్దిన అవంతి శ్రీనివాసరావు కి మాత్రం పదవి వచ్చింది కానీ ఆ రాజకీయ చాణక్యం పట్టుబడలేదు. అందుకే ఆయన విజయసాయిరెడ్డి తెర చాటునే ఉండిపోతున్నారు. తనకు ఇష్టం లేని గంటా వైసీపీకి వచ్చినా కూడా ఆయన సైలెంట్ కావడం తప్ప ఏం చేయలేని పరిస్థితి. అయితే వైసీపీలో మరో వాదన కూడా ఉంది. అవంతి శ్రీనివాసరావు వైసీపీలోకి వచ్చినందుకు ఆయనకు న్యాయం జరిగిందని, మంత్రి పదవి కూడా దక్కిందని అంటున్నారు. ఇంతకు మించి ఏం కావాలని కూడా ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎప్పటికపుడు రాజకీయ అవసరాల కోసం వ్యూహాలు రచిస్తుందని ఆ మేరకు కొందరిని చేర్చుకోవాలని ఎల్లకాలం మేమే ఉంటామంటే కుదరదు అని కూడా చెబుతున్నారు. మొత్తానికి అవంతికి స్ట్రాంగ్ వార్నింగ్ హై కమాండ్ ఇచ్చేసిందని చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News