ఏమీ తెలియకుండానే అన్నీ జరిగిపోతున్నాయట

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస‌రావు ఆవేద‌న ఇప్పట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు. త‌న సొంత జిల్లాలో త‌న‌కు క‌నీస స‌మాచారం కూడా లేకుండానే అధికారులు [more]

Update: 2020-11-17 02:00 GMT

విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అవంతి శ్రీనివాస‌రావు ఆవేద‌న ఇప్పట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు. త‌న సొంత జిల్లాలో త‌న‌కు క‌నీస స‌మాచారం కూడా లేకుండానే అధికారులు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో ఆయ‌న గాబ‌రా ప‌డుతున్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన యేడాదిన్నర కాలంగా ఇదే తంతు న‌డుస్తోంది. తాజాగా ఇది కంటిన్యూ అవుతోంది. ఇటీవ‌ల విశాఖ జిల్లాలో కీల‌క‌మైన గీతం యూనివ‌ర్సిటీ ఆక్రమ‌ణ‌ల‌ను అధికారులు అర్ధరాత్రి వేళ వెళ్లి కూల‌గొట్టారు. టీడీపీకి చెందిన నాయ‌కుల వ‌ర్సిటీ కావ‌డం… ఇప్పటికే టీడీపీ నేత‌ల‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దూకుడు ప్రద‌ర్శిస్తుండ‌డంతో ఇది కూడా రాజ‌కీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది.

మంత్రికి సమాచారం లేకుండానే…..

అంతేకాదు. స్థానికంగా ఉన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వంటివారు .. మంత్రి అవంతి శ్రీనివాస్ పాత్ర కూడా ఈ కూల‌గొట్టడం వెనుక ఉంద‌ని ఆరోపించారు. అయితే, ఈ విష‌యంపై ఏం చెప్పాలో అర్ధం కాక అవంతి తిక‌మ‌క‌ప‌డ్డారు. త‌న‌కు సంబంధం లేద‌ని అంటే.. జిల్లాకు చెందిన మంత్రికి తెలియ‌కుండానే మ‌రికొంద‌రు ఇక్కడ చ‌క్రం తిప్పుతున్నారని, మంత్రి ఉండి కూడా ఏం లాభ‌మ‌ని.. మ‌రోఆరోప‌ణ తెర‌మీదికి వ‌చ్చే ప్రమాదం ఉంద‌ని అవంతి భావించారు. పోనీ.. తెలుసు అందామంటే. అస‌లు అక్కడ ఏం జ‌రిగిందో నిజంగానే ఆయ‌నకు తెలియ‌ద‌ట‌. గీతం వ‌ర్సిటీ.. కూల్చివేత‌లు జ‌రిగిపోయే వ‌ర‌కు నిజంగానే అవంతికి స‌మాచారం లేదు.

తనకేమీ తెలియడం లేదని…..

ఇదంతా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో చ‌క్రం తిప్పుతున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి క‌నుస‌న్నల్లోనే జ‌రిగిపోయింది. గీతం వ‌ర్సిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను తెప్పించుకోవ‌డం దగ్గర నుంచి మేధావులు, అధికారుల‌తో ఆయా లోపాల‌ను చ‌ర్చించే విష‌యం వ‌ర‌కు… చివ‌రాఖ‌రుకు గోడ‌ల‌ను కూల్చేసేవ‌ర‌కు కూడా విష‌యం ఒక్క ముక్క కూడా లీక్ కాకుండా చూసుకున్నారు విజ‌య‌సాయి. అయితే, జిల్లాకే చెందిన మంత్రి అవంతి శ్రీనివాస్ కి కూడా ఈ విష‌యం తెలియ‌క పోవ‌డమే ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. కాగా, గ‌తంలోనూ తాను కేవ‌లం మంత్రిగానే ఉన్నాను త‌ప్ప.. త‌న‌కేమీ తెలియ‌డం లేద‌ని .. అవంతి ఏకంగా జ‌గ‌న్ ముందే ఆవేద‌న వ్యక్తం చేశారు.

పేరుకు మాత్రమే మంత్రి…..

దీంతో జ‌గ‌న్ .. సాయిరెడ్డిని త‌గ్గాలంటూ.. కొంత హెచ్చరించార‌ని ప్రచారంలోకి వ‌చ్చింది. ఇదినిజ‌మేనా.. అన్నట్టుగా సాయిరెడ్డి కూడా దూకుడు త‌గ్గించారు. అనంత‌రం .. గంట‌కోసారి అవంతి శ్రీనివాస్ మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే, మ‌ళ్లీ ఇప్పుడు సాయిరెడ్డి దూకుడు పెంచ‌డంతో అవంతి ఆవేద‌న‌లో కూరుకుపోయార‌ట‌. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మ‌ళ్లీ వాయిస్ త‌గ్గించేశారు. సో.. మ‌రి ఇప్పుడు ఏం జ‌రుగుతుందో ? చూడాలి. ఇక్కడ కొస‌మెరుపు ఏంటంటే.. సీనియ‌ర్ అధికారులు కూడా మంత్రి అవంతి శ్రీనివాస్ ని లెక్క చేయ‌క‌పోవ‌డం. ఇప్పటికే అవంతి మంత్రి అయ్యి యేడాదిన్నర అవుతోంది. మ‌రో యేడాదిలో ఆయ‌న్ను త‌ప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పాపం అవంతి శ్రీనివాస్ పేరుకు మాత్రమే మంత్రిగా ఉన్నార‌ని.. ఇంత డ‌మ్మీ అవుతాన‌ని అనుకోలేద‌ని బాధ‌ప‌డుత‌న్నార‌న్న గుస‌గుస‌లు విశాఖ రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News