ఈ మంత్రికి నిద్రకూడా ప‌ట్టడం లేదా..? ఆ ఐఏఎస్ దెబ్బకు?

కొన్ని కొన్ని ప‌రిస్థితులు ఎంత‌టివారినైనా కుంగ‌దీస్తాయి. వీరిలో సాధార‌ణ వ్యక్తులే కాదు.. నాయ‌కులు, మంత్రులు కూడా ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి ఎవ‌రైనా మంత్రి అయ్యారంటే.. [more]

Update: 2020-09-08 12:30 GMT

కొన్ని కొన్ని ప‌రిస్థితులు ఎంత‌టివారినైనా కుంగ‌దీస్తాయి. వీరిలో సాధార‌ణ వ్యక్తులే కాదు.. నాయ‌కులు, మంత్రులు కూడా ఉన్నారంటే ఒకింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నిజానికి ఎవ‌రైనా మంత్రి అయ్యారంటే.. ఇంకేముంది.. ఆయ‌నంతా దున్నేస్తారు! అనే భావ‌న వ్యక్తమ‌వుతుంది. అయితే, మంత్రుల‌కు మాత్రం క‌ష్టాలు ఉండ‌వా ? అంటే.. పాల‌నాప‌రంగా క‌ష్టాలు.. ప్రత్యర్థుల ప‌రంగా ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. అయితే, వైసీపీ స‌ర్కారులో మంత్రిగా ఉన్న విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస‌రావుకు మ‌రోక‌ష్టం వ‌చ్చింది.

పట్టు సాధించాలనుకున్న టైంలో….

ఏకంగా అవంతి శ్రీనివాస‌రావుకు కంటిపై కునుకు కూడా లేకుండా చేస్తున్న ఈ విష‌యం.. ముంచుతూ.. నాన్చుతూ.. ఇబ్బందుల‌కు గురి చేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌హ‌జంగా ఏ మంత్రికైనా ఉన్నట్టుగానేఅవంతి శ్రీనివాస‌రావుకి కూడా విశాఖ‌పై ప‌ట్టు పెంచుకునేందుకు ఉన్న మార్గాల‌ను అన్వేషించాల‌ని అనుకుంటున్నారు. కానీ, ఆ అవ‌కాశం చిక్కిన‌ట్టే చిక్కి.. చేజారి పోతోంది. మ‌రోవైపు త‌న రాజ‌కీయ ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి ఎక్కడ వ‌స్తారో అన్న టెన్షన్ ఒక‌టి అవంతికి ఉంది. ఇక జిల్లాను పాల‌నా రాజ‌ధాని చేస్తున్నార‌న‌ప్పుడు.. ఆదిలో సంతోషించింది.. అవంతే. ఇంకేముంది.. త‌న రాజ‌కీయాలు పుంజుకుంటాయ‌ని, జిల్లాపై ప‌ట్టు సాధిస్తాన‌ని అనుకున్నారు.

ఎంత సర్దుకుపోతున్నా…..

కానీ, ఈ ఆనందం ఇంత‌లోనే ఆవిరైంది. జిల్లాను పాల‌నా రాజ‌ధానిగా ప్రతిపాదించిన త‌ర్వాత.. ఓ అధికారి.. సీఎంకు చాలా ద‌గ్గర‌గా ఉన్న ఐఏఎస్‌.. విశాఖ‌పై పెత్తనం చేస్తున్నారు. క‌నీసం మంత్రిని కూడా సంప్రదించ‌కుండానే ఆయ‌న ఇక్కడ‌కు రావ‌డం, ప‌ర్యటించ‌డం, ప్రభుత్వానికి అనుకూల‌మైన ప‌నులు చేసుకుంటూ పోవ‌డం అవంతి శ్రీనివాస‌రావుని తీవ్రస్థాయిలో క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. వాస్తవానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు వైసీపీలోకి వ‌స్తార‌ని భావించిన అవంతి శ్రీనివాస‌రావు ఆయ‌న‌పై ఎదురుదాడి చేశారు.అదే స‌మ‌యంలో సొంత పార్టీలోనే విజ‌య‌సాయిరెడ్డి వంటివారి నుంచి అవ‌మానాలు ఎదురైన‌ప్పుడు కూడా స‌ర్దుకు పోయారు.

ఆ ఐఏఎస్ దెబ్బకు….

కానీ, ఇప్పుడు సీఎం జ‌గ‌న్ క‌నుస‌న్నల్లో ఆయ‌న‌కే స‌ల‌హాలు ఇచ్చే రేంజ్‌లో వ్యవ‌హారాలు చ‌క్కబెడుతున్న ఓ ఐఏఎస్ దెబ్బతో అవంతి శ్రీనివాస‌రావు ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నార‌ని అంటున్నారు విశాఖ రాజ‌కీయ ప‌రిశీల‌కులు. నాయ‌కుల‌నైతే.. ఎలాగోలా విమ‌ర్శించే అవ‌కాశం ఉంటుంది. కానీ, అధికారి.. పైగా సీఎంకు అత్యంత ఆత్మీయుడు.. ఇప్పుడు ఈయ‌న దూకుడును ఎలా అడ్డుకోవాలి? అనే విష‌యంలో మాత్రం అవంతి శ్రీనివాస‌రావు తీవ్రస్థాయిలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని తెలుస్తోంది. మ‌రి మున్ముందు ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News