బ్రేకింగ్ : జగన్ కేసులోకీలక మలుపు

జగన్ పై విశాఖ పట్నంఎయిర్ పోర్టులో జరిగిన కత్తి దాడి కేసు కీలక మలుపు తిరిగింది. కాసేపటి క్రితం హైకోర్టులో దీనిపై వాదనలుజరిగాయి. జగన్ పై హత్యాయత్నం [more]

Update: 2019-01-04 05:55 GMT

జగన్ పై విశాఖ పట్నంఎయిర్ పోర్టులో జరిగిన కత్తి దాడి కేసు కీలక మలుపు తిరిగింది. కాసేపటి క్రితం హైకోర్టులో దీనిపై వాదనలుజరిగాయి. జగన్ పై హత్యాయత్నం కేసును నేషనల్ ఇన్విస్టిగేటివ్ ఏజెన్సీకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. జగన్ పై గత ఏడాది అక్టోబరు 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం కు అప్పగించింది. కానీ హత్యయత్నం కేసులో డీజీపీ, చంద్రబాబు జగన్ అభిమాని మాత్రమే దాడి చేశారని వ్యాఖ్యానించడంతో ఏపీ పోలీసుల విచారణలో తనకు న్యాయం జరగదని భావించి జగన్ హైకోర్టును ఆశ్రయించారు.

ఆధారాలు తారుమారవుతాయని….

దీనిపై విచారించిన హైకోర్టు ఎన్ఐఏ కు ఈకేసును అప్పగించింది. దాడి చేసిన శ్రీనివాసరావు కేవలం ప్రచారం కోసమే చేశారని రెండు రోజుల క్రితం విశాఖ పోలీసు కమిషనర్ మహేంద్ర చంద్ర లడ్డా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తుసంస్థల ద్వారా ఈ దాడి కేసులో నిజాల నిగ్గుతేల్చాలన్న జగన్ తరుపున న్యాయవాది వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. విచారణ ఆలస్యమైతే ఆధారాలు తారుమారయ్యే అవకాశముందని జగన్ తరుపు న్యాయవాది వాదించారు. మొత్తం మీద జగన్ కోరుకున్నట్లుగానే తనపై హత్యాయత్నంకేసులో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ చేత విచారణ జరిపించడానికి హైకోర్టు అంగీకరించింది.

Tags:    

Similar News