సుడిగుండంగా టీడీపీ ప‌రిస్థితి.. నేత‌ల‌ను కాపాడుకోక‌పోతే.. క‌ష్టమే

ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి సుడిగుండంగా మారిపోయిందా ? ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కొనాలో తెలియ‌క పార్టీ అధిష్టానం ఇబ్బంది ప‌డుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నార [more]

Update: 2020-06-01 08:00 GMT

ఏపీ ప్రధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి సుడిగుండంగా మారిపోయిందా ? ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాల‌ను ఎదుర్కొనాలో తెలియ‌క పార్టీ అధిష్టానం ఇబ్బంది ప‌డుతోందా? అంటే.. ఔన‌నే అంటున్నార ప‌రిశీల‌కులు. ప్రస్తుతం పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా త‌యారైంది. కొంద‌రు నాయ‌కులు కేసుల్లో చిక్కుకుని అల్లాడుతు న్నారు. మ‌రికొంద‌రు సొంత వ్యాపారాలు ముందుకు సాగ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. ఇంకొంద‌రు పార్టీలో ఉండి కూడా చంద్రబాబుపై విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. దీంతో పార్టీలో అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే గంద‌ర‌గోళం త‌లెత్తుతోంది.

కూన లొంగిపోయి….

టీడీపీలో ఫైర్ బ్రాండ్.. అధికారుల‌ను దూషించి వివాదాస్పదంగా వ్యవహరించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. మాజీ తహసీల్దార్ ను దూషించి బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అనేక వివాదాల్లో కేంద్రబిందువుగా రవికుమార్ ఉన్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనపై ఉన్న కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే, కూన కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. బుధవారం లొంగిపోయేందుకు కూడా తన పంథా వీడకుండా భారీగా టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా రావడం విశేషం. శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ లో ఆయన లొంగిపోయారు.

జగన్ ను ప్రశంసిస్తూ…

ఇక‌, కరువు ప్రాంతాలకు నీరు తరలించేందుకు సీఎం జ‌గ‌న్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. విద్యుత్ చార్జీలు ఎత్తేయాలంటూ టీడీపీ నేతలు చేసే దీక్షలు వృధా అని తెలిపారు. ఎందుకు దీక్షలు చేస్తున్నారో టీడీపీ నేతలకే తెలియదని ఆయన చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి జీవో తెచ్చిన సీఎం జగన్‌కు ఆయన అభినందనలు తెలిపారు. పోతిరెడ్డిపాడు కోసం మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చాలా కృషి చేశారని జేసీ దివాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఇక ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ మ‌హానాడుకు దూర‌మ‌య్యారు.

సీనియర్ నేతలు సయితం….

అదేవిధంగా సీనియ‌ర్ నేత‌లు విజ‌య‌వాడ‌లో ఉండి కూడా కార్యక్ర‌మానికి డుమ్మా కొట్టారు. ఇక ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కాగా.. ఇక మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు సైతం అదే రూట్లో ఉన్నార‌ని టీడీపీ వ‌ర్గాల్లోనే ప్రచారం జ‌రుగుతోంది. ఇలా మొత్తంగా చూస్తే.. టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News