పార్టీని పూర్తిగా పడుకోబెట్టేశారుగా?

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం పోతున్నట్లుంది. నిత్యం పార్టీలో విభేదాలతో రచ్చ కెక్కుతుండటం కూడా ప్రజలకు చికాకు తెప్పిస్తున్నట్లే కనపడుతుంది. సీనియర్ నేత అశోక్ [more]

Update: 2020-12-18 17:30 GMT

రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకం పోతున్నట్లుంది. నిత్యం పార్టీలో విభేదాలతో రచ్చ కెక్కుతుండటం కూడా ప్రజలకు చికాకు తెప్పిస్తున్నట్లే కనపడుతుంది. సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సయితం రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని సక్రమంగా నడపలేకపోతున్నారన్న భావన ఆయనపై బలంగా పడింది. అయితే ఆయన మాత్రం బీజేపీ తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తుందని చెప్పి ఎప్పటికప్పడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పాలనపై పట్టులేక….

రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు దాటుతున్నా ఇంకా పాలన గాడిన పడలేదు. అశోక్ గెహ్లాత్ కు తన ఎమ్మెల్యేలను రక్షించుకోవడంతోనే సమయం సరిపోతుంది. మొన్నటి దాకా సచిన్ పైలట్ తో ఆయనకున్న విభేదాలు పాలనను గాడి తప్పించాయంటున్నారు. దాదాపు మూడు, నాలుగు నెలలు సచిన్ పైలట్ సంక్షోభం కాంగ్రెస్ ప్రభుత్వంలో నడిచింది. చివరకు అధిష్టానం జోక్యంతో సర్దుబాటు అయింది.

కూల్చేందుకు కుట్ర అంటూ….

అయితే మరోసారి తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఆరోపిస్తున్నారు. తొలి నుంచి రాజస్థాన్ లో ఒడిదుడుకుల మధ్యనే ప్రభుత్వం నడుస్తుంది. ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల సహకారంతో అశోక్ గెహ్లాత్ నెట్టుకొస్తున్నారు. సహజంగా రాజస్థాన్ లో ఒకసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరోసారి వచ్చే అవకాశమే లేదు. గత కొన్ని దఫాలుగా ఈ సెంటిమెంట్ రాజస్థాన్ లో పనిచేస్తుంది.

స్థానిక సంస్థల ఎన్నికలలో….

తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు అశోక్ గెహ్లాత్ ప్రభుత్వ పనితీరును చెప్పకనే చెబుతున్నాయి. 20 జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరిగితే అందులో 12 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం ఐదింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారంటే ఆయనపై విశ్వాసం ఎంత ఉందో ఇట్టే అర్ధమవుతుంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ డౌన్ ఫాల్ స్టార్టయిందని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే చెబుతన్నాయి. అయితే వీటన్నింటిని కప్పిపుచ్చుకునేందుకే అశోక్ గెహ్లాత్ బీజేపీ పై నిందలు వేస్తున్నారంటున్నారు.

Tags:    

Similar News