వాళ్లు హ్యాండిస్తే.. బ్యాండ్ తప్పదు

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం పూర్తి సంక్షోభంలోకి వెళ్లింది. 19 మంది సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవ్వడంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో [more]

Update: 2020-07-25 16:30 GMT

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం పూర్తి సంక్షోభంలోకి వెళ్లింది. 19 మంది సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు పార్టీకి దూరమవ్వడంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అయితే స్వతంత్ర సభ్యుల మద్దతుతో అశోక్ గెహ్లాత్ విశ్వాస పరీక్షలో నెగ్గాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ స్వతంత్ర సభ్యులు తమవైపే ఉండటంతో వీలయినంత త్వరగా బలపరీక్ష నిర్వహించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అందుకే పట్టు…

సమయం గడిచే కొద్దీ స్వతంత్ర సభ్యుల మనసు మారితే తన ప్రభుత్వానికి ముప్పు తప్పదని అశోక్ గెహ్లాత్ కు తెలియంది కాదు. అందుకే గవర్నర్ వద్దకు వెళ్లి తన వర్గం ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించారు. దీంతో పాటు సుదీర్ఘకాలం పాటు ఎమ్మెల్యేలతో క్యాంప్ లను కొనసాగించే పరిస్థితి లేదు. హైకోర్టులో సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ కేసు ఎప్పటికి తేలుతుందో తెలియదు. అందుకే అశోక్ గెహ్లాత్ విశ్వాస పరీక్షకు పట్టుబడుతున్నారు.

స్వతంత్ర సభ్యులపైనే…..

తనకు 102 మంది సభ్యుల మద్దతు ఉందని అశోక్ గెహ్లాత్ చెబుతున్నారు. ఈ 102 మందిలో పది మంది వరకూ స్వతంత్ర సభ్యులే. అంటే ఒకరకంగా ఇండిపెండెంట్ల మద్దతు పైనే అశోక్ గెహ్లాత్ భవితవ్యం ఆధారపడి ఉంది. స్వతంత్ర సభ్యులు ఇప్పటి వరకూ అయితే అశోక్ గెహ్లాత్ వెంటే ఉన్నారు. కానీ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే అశోక్ గెహ్లాత్ బలపరీక్ష త్వరగా నిర్వహించాలని తపన పడుతున్నారు.

క్లోజ్ మానటరింగ్…..

స్వతంత్ర సభ్యుల్లో కొంతమందితో ప్రత్యర్థులు బేరసారాలకు దిగినట్లు అశోక్ గెహ్లాత్ గుర్తించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కాకుండా స్వతంత్ర సభ్యులకు ప్రత్యేక క్యాంప్ ను ఏర్పాటు చేసి వారివద్ద నమ్మకమైన నేతలను ఉంచారు. వారి ఫోన్ల సంభాషణలను కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. వీలయనంత త్వరగా బలపరీక్ష నిర్వహించి, అందులో నెగ్గి, సచిన్ పైలట్ వర్గం పై అనర్హత వేటు వేయాన్నది అశోక్ గెహ్లాత్ ప్రయత్నం. మరి ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News