ఈ ముసలోళ్లు ఇద్దరూ ముంచేశారా?

కాంగ్రెస్ రాజకీయాలంతా అంతే. వయసుడిగిపోయినా.. ఎన్ని పదవులు అనుభవించినా తమ ఆధిపత్య చెక్కుచెదరకూడదని భావిస్తారు. దీనివల్లే కాంగ్రెస్ కు నష్టం చేకూరుతుంది. దీర్ఘకాలంగా పదవులు అనుభవించినా వారి [more]

Update: 2020-07-13 16:30 GMT

కాంగ్రెస్ రాజకీయాలంతా అంతే. వయసుడిగిపోయినా.. ఎన్ని పదవులు అనుభవించినా తమ ఆధిపత్య చెక్కుచెదరకూడదని భావిస్తారు. దీనివల్లే కాంగ్రెస్ కు నష్టం చేకూరుతుంది. దీర్ఘకాలంగా పదవులు అనుభవించినా వారి కుతి తీరదు. ఓపిక ఉన్నంత వరకూ తామే పదవిలో కొనసాగాలని భావిస్తారు. కాంగ్రెస్ కొంప ముంచుతుంది అదే. మధ్యప్రదేశ్ లోగాని, రాజస్థాన్ లోగాని కాంగ్రెస్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ఇదే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. సీనియర్ నేతలు కమల్ నాధ్, అశోక్ గెహ్లాత్ లు మొండిపట్టు వీడకపోవడంతోనే ఫలితం అనుభవించాల్సి వస్తుంది.

విలువ లేకుండా చేస్తూ…..

మధ్యప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా జ్యోతిరాదిత్య సింధియా ఉండాలని భావించారు. హైకమాండ్ కూడా ఒక దశలో జ్యోతిరాదిత్య సింధియా పేరు ఖరారు చేయాలని భావించింది. అయితే అప్పటి ముఖ్యమంత్రి కమల్ నాధ్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యతిరేకించారు. సింధియాకు వ్యతిరేకంగా పావులు కదిపారు. సింధియా మాటలకు ప్రభుత్వంలోనూ విలువ లేకుండా చేశారు. దీంతో సింధియా పార్టీని వీడి బయటకు వచ్చారు. ఇప్పుడు రాజస్థాన్ లోనూ పీసీీసీ అధ్యక్ష పదవి నుంచి సచిన్ పైలెట్ ను తొలగించాలని అశోక్ గెహ్లాత్ భావించారు. అదే సమస్యగా మారింది.

మధ్యప్రదేశ్ తరహాలోనే…..

రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగానూ, పీసీసీ అధ్యక్షుడిగానూ సచిన్ పైలెట్ ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని అశోక్ గెహ్లాత్ ప్రయత్నిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలెట్ కు తెలియకుండా విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటుండటం ఆయనను బాధించింది. సచిన్ పైలెట్ కు దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉన్న విషయం అశోక్ గెహ్లాత్ కు తెలియంది కాదు.

ఆయన వైఖరి వల్లనే…..

మరోవైపు మధ్యప్రదేశ్ లో జరిగిన పరిణామాలను అశోక్ గెహ్లాత్ చూశారు. అయినా కూడా ఆయనలో మార్పు రాలేదు. తన ఆధిపత్యం కోసం అశోక్ గెహ్లాత్ సచిన్ పైలెట్ ను ఇబ్బంది పెట్టారు. ఫలితంగా సచిన్ పైలెట్ అసమ్మతి బావుటాను ఎగురవేశారు. భవిష్యత్ లో రాజస్థాన్ లో ప్రభుత్వానికి ముప్పు ఏర్పడితే అది అశోక్ గెహ్లాత్ స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు. రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయ పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా గమనిస్తుంది. సచిన్ పైలెట్ పార్టీలోకి వస్తే తీసుకునేందుకు రెడీ గా ఉంది. మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో సీనియర్ నేతలు కమల్ నాధ్, అశోక్ గెహ్లాత్ ల వైఖరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ముంచేస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News