గేమ్ స్టార్టయింది… గెలుపు ఎవరిదో?

రాజస్థాన్ రాజకీయం మరింత వేడెక్కింది. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రావడంతో సచిన్ పైలట్ వర్గం మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ [more]

Update: 2020-07-24 18:29 GMT

రాజస్థాన్ రాజకీయం మరింత వేడెక్కింది. హైకోర్టులో తీర్పు తమకు అనుకూలంగా రావడంతో సచిన్ పైలట్ వర్గం మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ బలాన్ని నిరూపించుకుంటానని రాజ్ భవన్ వెంట పరుగులు పెడుతున్నారు. అయినా గవర్నర్ నుంచి రెస్పాన్స్ రావడం లేదు. ఇది అశోక్ గెహ్లాత్ లో అసహనం రేకెత్తిస్తుంది. ఒక్కసారి బలాన్ని నిరూపించుగోలిగితే మరో ఆరు నెలలు అవిశ్వాసానికి తావుండదు. ఈలోపు పార్టీని బలోపేతం చేయవచ్చన్నది అశోక్ గెహ్లాత్ ఆలోచనగా ఉంది.

బలపరీక్ష కు దిగుదామనుకున్నా……

కానీ రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. బలపరీక్షకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందడం లేదు. మరోవైపు ఉన్న ఎమ్మెల్యేలు ఎటు వైపు వెళతారో అర్థం కాని పరిస్థితి ఉంది. హార్స్ రైడింగ్ జరగడానికి పెద్దగా సమయం అక్కరలేదు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేలే అశోక్ గెహ్లాత్ బలం. స్వతంత్ర సభ్యులు మద్దతిస్తేనే ఆయన బలపరీక్షలో నెగ్గుతారు. అలాగే సచిన్ పైలట్ వర్గం పై అనర్హత వేటు వేసినా ప్రభుత్వ మనుగడకు ఢోకా ఉండదు. కానీ ఈ రెండింటిలోనూ అశోక్ గెహ్లాత్ కలసి రాలేదు.

ఏమాత్రం చేజారినా…..

ప్రస్తుతం సచిన్ పైలట్ వెనక బీజేపీ ప్రమేయం ఉందని అశోక్ గెహ్లాత్ గట్టిగా వాదిస్తున్నారు. అందుకే గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాలపై మాట్లాడటం లేదంటున్నారు. మరోవైపు వరసగా తన కుటుంబసభ్యులపైనా, సన్నిహితులపైనా ఆదాయపు పన్ను శాఖ దాడులు జరుగుతుండటాన్ని కూడా అశోక్ గెహ్లాత్ పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి ముప్పు ఖాయమే.

బేరసారాలు షురూ…..

హైకోర్టు సయితం సచిన్ పైలట్ వర్గంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిచండంతో తన వర్గ ఎమ్మెల్యేలను ఎన్నిరోజులు కాపాడుకోవాలన్నది అశోక్ గెహ్లాత్ కు సమస్యగా మారింది. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడినా, స్వతంత్ర ఎమ్మెల్యేలు మొఖం చాటేసినా గెహ్లాత్ ప్రభుత్వం కూలిపోయినట్లే. సమయం ఉండటంతో బీజేపీ, సచిన్ పైలట్ వర్గాలు బేరసారాలకు దిగే అవకాశముందని గ్రహించిన అశోక్ గెహ్లాత్ వారిని క్యాంప్ లకు తరలించారు. మొత్తం మీద రాజస్థాన్ రాజకీయంలో చివరకు ఎవరిది గెలుపు అన్నది చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News