కుప్పకూలిపోవడం ఖాయంగా కన్పిస్తుందే?

అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వం. దెబ్బ మీద దెబ్బతగులుతుంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ కు బాసటగా నిలుస్తున్న మిత్ర పక్షాలు సయితం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు [more]

Update: 2020-12-19 18:29 GMT

అసలే అంతంత మాత్రంగా ఉన్న ప్రభుత్వం. దెబ్బ మీద దెబ్బతగులుతుంది. ప్రభుత్వంలో కాంగ్రెస్ కు బాసటగా నిలుస్తున్న మిత్ర పక్షాలు సయితం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ కు హ్యాండ్ ఇస్తున్నాయి. ఇది కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ లో ఎప్పుడు ప్రభుత్వం కుప్పకూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇందుకు కారణం అశోక్ గెహ్లాత్ వైఖరి మాత్రమే కారణం కాదని, రోజురోజుకూ కాంగ్రెస్ ఇమేజ్ తగ్గిపోతుండటమేనని చెబుతున్నారు.

అప్పటి నుంచే వేట…..

మధ్యప్రదేశ్ లో కమల్ నాధ్ ప్రభుత్వం కుప్ప కూలిపోయిన నాట నుంచి అశోక్ గెహ్లాత్ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇటు బీజేపీ కూడా అధికారం కోసం కాచుకు కూర్చుని ఉంది. నిత్యం కెలుకుతూనే ఉంది. కాంగ్రెస్ శాసనసభ్యుల్లో అసహనం కూడా బీజేపీ దూకుడు పెంచడానికి కారణంగా చెబుతున్నారు. కాంగ్రెస్ శాసనసభ్యుల్లో కొందరు బీజేపీ సీనియర్ నేతలతో టచ్ లోకి రావడంతో ప్రభుత్వం ఉండే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.

అరకొర మెజారిటీతో….

రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ కు మొత్తం 107 సభ్యుల మద్దతు ఉంది. బీజేపీ సభ్యుల బలం 72 మాత్రమే. దీంతో బీజేపీ కొంత తటపటాయిస్తుంది. కాంగ్రెస్ కు చిన్నా చితకా పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో సచిన్ పైలెట్ వర్గానికి చెందని పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఇటీవల అశోక్ గెహ్లాత్ కు కొంత జర్క్ ఇచ్చినా దాని నుంచి ఆయన సునాయాసంగా బయటపడగలిగారు. మరోసారి రాజస్థాన్ లో అధికారం కోసం పరుగు ప్రారంభమయిందనే చెప్పాలి.

మిత్రపక్షం దూరం…..

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి కూడా ప్రభుత్వ మనుగడపై ప్రభావం చూపనుంది. ఇటీవల అశోక్ గెహ్లాత్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ వస్తున్న భారతీయ గిరిజన పార్టీ తన మద్దతును ఉపసంహరంచుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బీటీపీ నేత చోత భాయ్ ప్రకటించడంతో అధికార కాంగ్రెస్ పార్టీ కొంత ఇబ్బందిలో పడినట్లయింది. వరసగా మిత్రులు కూడా దూరం కానుండటంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరోసారి తిరుగుబాటు చేసే అవకాశం ఉందంటున్నారు.

Tags:    

Similar News