తేలిపోతుందా? తేలిపోనున్నారా?

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ భవితవ్యం రేపు తెలిపోనుంది. ఆయన బలపరీక్షకు సిద్ధమవుతారా? లేదా? అన్నది నెంబర్ ను పట్టి ఉంటుంది. రేపటి నుంచి రాజస్థాన్ అసెంబ్లీ [more]

Update: 2020-08-13 17:30 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ భవితవ్యం రేపు తెలిపోనుంది. ఆయన బలపరీక్షకు సిద్ధమవుతారా? లేదా? అన్నది నెంబర్ ను పట్టి ఉంటుంది. రేపటి నుంచి రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అశోక్ గెహ్లాత్ తన బలాన్ని నిరూపించుకోవాలన్నారు. సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి తిరిగి పార్టీలోకి రావడంతో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం గండం నుంచి బయట పడిందనే చెప్పాలి.

బీఎస్పీ ఎమ్మెల్యేల విషయంలో…..

సచిన్ పైలట్ వెంట 18 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. తనకు మద్దతుగా 102 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని అశోక్ గెహ్లాత్ చెబుతున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతస్తారని అశోక్ గెహ్లాత్ చెబుతున్నారు. బీఎస్సీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో విలీనం చేసుకోవడాన్ని తప్పుపడుతూ బీఎస్పీ, బీజేపీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సచిన్ బలం పెరిగితే…?

మొన్నటి వరకూ సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు గురించి అశోక్ గెహ్లాత్ ఆలోచించారు. ఎందుకంటే కాగా సచిన్ పెలట్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరింత మంది మద్దతు లభిస్తుందంటున్నారు. చేతులారా ప్రభుత్వంలో ఇబ్బందులు తెచ్చుకున్న అశోక్ గెహ్లాత్ కన్నా రాజకీయ భవిష్యత్ ఉన్న సచిన్ పైలట్ వెంట ఉండటమే మంచిదని అనేక మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు. సచిన్ పైలట్ యువనేత కావడం, ఆయనకు ప్రజాకర్షణ ఉండటంతో మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపే అవకాశముందని అధిష్టానం సయితం భావించింది. అందుకే రాహుల్, ప్రియాంకలో సచిన్ తో భేటీ అయి సమస్యను ఒక కొలిక్కి తెచ్చాారు.

బీజేపీ వ్యూహం ఏమిటో?

అసెంబ్లీ సమావేశాల్లో జరిగే బలపరీక్ష సందర్భంగా అసలు విషయం బయటపడుతుందని బీజేపీ ధీమా ఉంది. అశోక్ గెహ్లాత్ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ సిద్ధమయింది. సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ తో కలసినా అది ఎంతకాలం నిలవదన్నది బీజేపీ అంచనా. ఇప్పటికే బీజేపీ తమ ఎమ్మెల్యేలను గుజరాత్ కు తరలించింది.. రేపు జరిగే రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కానీ సచిన్ రావడంతో అశోక్ గెహ్లాత్ గండం నుంచి బయటపడినా.. బీజేపీ వ్యూహాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News