టెన్షన్..టెన్షన్ …నరాలు తెగుతున్నాయిగా?

ఒక్కో సమయంలో తగ్గడమే బెటర్. ఈ విషయం అంచుల దాకా వచ్చిన తర్వాత గాని ఆయనకు తెలియలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా [more]

Update: 2020-08-03 16:30 GMT

ఒక్కో సమయంలో తగ్గడమే బెటర్. ఈ విషయం అంచుల దాకా వచ్చిన తర్వాత గాని ఆయనకు తెలియలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే న్యాయస్థానంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎత్తులను చిత్తు చేయాల్సి ఉంది. ఇంకో పన్నెండు రోజుల్లో రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో పరిస్థిితి ఉత్కంఠగా మారింది.

ఎంత వత్తిడి తెచ్చినా…..

మరో వైపు సచిన్ పైలట్ వర్గం ధీమాగా ఉంది. తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నట్లు సచిన్ పైలట్ ప్రకటించడంతో అశోక్ గెహ్లాత్ లో మరింత టెన్షన్ మొదలయింది. సచిన్ పైలట్ వర్గంలో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను తిరిగి రప్పించేందుకు అశోక్ గెహ్లాత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, సన్నిహితుల ద్వారా కూడా వత్తిడి తెచ్చారు. అయినా ససేమిరా అనడంతో అశోక్ గెహ్లాత్ బలపరీక్షకు సిద్ధమవ్వాలి.

మెజారిటీ లేకపోవడంతో…..

ప్రస్తుతం అశోక్ గెహ్లాత్ శిబిరంలో 99 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు అవసరం. మరో వైపు బీఎస్పీ ఎమ్మెల్యేల అనర్హత విషయం కూడా అశోక్ గెహ్లాత్ కు టెన్షన్ పట్టుకుంది. ఆగస్టు 14వ తేదీన రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు కరోనా కట్టడి తదితర అంశాలపై చర్చించడానికి పెడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నా బలపరీక్ష చేసుకునేందుకే అశోక్ గెహ్లాత్ సిద్దమయ్యారని చెబుతున్నారు.

బీజేపీ రంగంలోకి దిగడంతో…..

ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాత్ సచిన్ పైలట్ వర్గాన్ని దువ్వే ప్రయత్నం చేశారు. సచిన్ పైలట్ తో సహా ఆయన వర్గీయులందరూ తిరిగి పార్టీలోకి వస్తామంటే స్వాగతిస్తామని అశోక్ గెహ్లాత్ చెప్పారు. అధిష్టానం అనుమతిస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని అశోక్ గెహ్లాత్ తెలిపారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించడంతోనే అశోక్ గెహ్లాత్ ఈరకమైన ప్రతిపాదన తీసుకువచ్చారు. మొత్తం మీద అశోక్ గెహ్లాత్ టెన్షన్ పడుతున్నారనే చెప్పాలి.

Tags:    

Similar News