వీరిద్దరితోనే వారికి నష్టం.. వీరికి లాభమా?

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇద్దరి నేతల గురించి చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరూ బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడుతున్నారా? లేదా? కాంగ్రెస్ ను మరింత దిగజార్చేందుకు ఈ [more]

Update: 2021-03-07 17:30 GMT

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇద్దరి నేతల గురించి చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరూ బీజేపీకి పరోక్షంగా ఉపయోగపడుతున్నారా? లేదా? కాంగ్రెస్ ను మరింత దిగజార్చేందుకు ఈ రెండు పార్టీలు బాగా ఉపకరిస్తున్నాయంటున్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైైసీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లు విపక్షాలకు ఇబ్బందికరంగా మారారు. బీజేపీకి పరోక్షంగా సాయపడుతున్నారు. అనేక రాష్టాల్లో జరిగిన ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు దీనిని నిరూపించాయి.

బీహార్ ఎన్నికలలో….

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నుంచి తన పార్టీని ప్రారంభించి మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ లకు విస్తరించారు. అధికారంలోకి వచ్చే స్థాయిలో ఆ యా రాష్ట్రాల్లో ఎంఐఎం అభ్యర్థులు గెలవలేకపోయినా కాంగ్రెస్, విపక్షాలను మాత్రం అధికారంలోకి రాకుండా నిలువరించగలిగారు. బీహార్ ఎన్నికలనే తీసుకుంటే అక్కడ ఎంఐఎం లేకుంటే ఆర్జేడీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది. కాంగ్రెస్ కూటమి రాకుండా అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేశారు.

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో….

ఇప్పుడు గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించడం కూడా కాంగ్రెస్ కు డేంజర్ సిగ్నల్స్ అని చెప్పక తప్పదు. ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి పంజాబ్, హర్యానా, గోవా, బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించారు. గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవుతుంది.

రెండు పార్టీలూ…..

ఎంఐఎం ముస్లిం సామాజికవర్గాన్ని ఆకట్టుకుంటుంది. సంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంకు కావడంతో ఎంఐఎం కాంగ్రెస్ కు మాత్రమేనష్టం చేకూరుస్తుంది. ఎంఐఎం వల్ల బీజేపీకి ఎటువంటి నష్టంలేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సామాజికవర్గంతో సంబంధం లేకపోయినా ఉద్యోగ, మధ్యతరగతి, మేధావి వర్గాల ఓటు బ్యాంకు ఉంది. ఈ ఓట్లు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, విపక్షాలకుపడే ఛాన్స్ ఉంది. ధరల పెరుగుదల వంటి అంశాలతో బీజేపీకి దూరమయ్యారు. వీరి ఓట్లను ఆమ్ ఆద్మీ చీల్చడం ద్వారా బీజేపీ లబ్ది పొందుతుందంటున్నారు. మొత్తానికి రాబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో ఈ రెండు పార్టీల ప్రభావం విపక్షాలకు మాత్రమే నష్టం చేకూరుస్తాయన్న చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News