Chandrababu : బాబు ట్రాప్ లో వైసీపీ పూర్తిగా పడిపోయిందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలను రచించడంలో దిట్ట. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో నేతలను చూశారు. కానీ జగన్ ఒక్కరే మింగుడుపడటం లేదు. [more]

Update: 2021-10-19 13:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలను రచించడంలో దిట్ట. ఆయన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎందరో నేతలను చూశారు. కానీ జగన్ ఒక్కరే మింగుడుపడటం లేదు. ఎంతో మంది నేతలను రాజకీయంగా ఎదుర్కొన్న చంద్రబాబుకు జగన్ మాత్రం కొరుకుడు పడటం లేదు. అయితే ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఆయన తన స్కెచ్ ను సిద్ధం చేస్తున్నట్లే కనపడుతుంది. టీడీపీ ట్రాప్ లో వైసీపీ పడినట్లే కనపడుతుంది.

అన్ని రకాలుగా నష్టపోయి…

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అన్ని విధాలుగా నష్టపోయి ఇబ్బంది పడుతోంది. క్యాడర్ లో జోష్ లేదు. నేతల్లో నైరాశ్యం నెలకొంది. చంద్రబాబు గత కొద్ది నెలలుగా నూరిపోస్తున్నా నేతల వైఖరిలో మార్పు లేదు. పరిషత్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ క్యాడర్ ఇంకా డీలా పడిపోయింది. కానీ ఏవీ కలసి రావడం లేదు. దీంతో పట్టాభి రూపంలో తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూరిందనే చెప్పాలి.

పట్టాభి ని ఎవరూ….

నిజానికి పట్టాభి వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు. పార్టీలోనే పట్టాభి కామెంట్స్ ను ఎవరూ పట్టించుకోరు. కేవలం తనకు భాషపై ఉన్న పట్టు తోనే ఆయన పార్టీలో కొంత గ్రిప్ సంపాదించారు. జగన్ ను తిడితే వైసీపీ నేతలు రెచ్చిపోతారు. ఈవిషయం చంద్రబాబుకు తెలుసు. అందుకే పట్టాభి చేత ప్లాన్ ను అమలు చేయించారు. అనుకున్నట్లుగానే పట్టాభి రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగారు.

ఆర్థిక నష్టం కంటే….?

ఈ ఘటనకు పార్టీకి ఆర్థికంగా జరిగిన నష్టం కంటే సానుభూతిని టీడీపీకి తెచ్చిపెట్టాయని చెప్పాలి. వెంటనే చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. హోంశాఖకు లేఖలు రాశారు. తమ పార్టీ కార్యాలయాలకు, నేతలకు రక్షణ లేదని చెప్పారు. ఈ తప్పులన్నీ వచ్చే ఎన్నికల సమయంలో ఉపయోగపడతాయి. కేంద్ర బలగాలను దించడానికి, పోలీసు ఉన్నతాధికారులను పక్కన పెట్టడానికి ఈ సంఘటనలన్నీ ఉపయోగపడతాయి. చంద్రబాబు ఈరోజే హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు. తమ కార్యాలయాలపై దాడులకు దిగడంతో టీడీపీ క్యాడర్ లో కూడా కసి పెరిగింది. చంద్రబాబు ఆశించింది ఇదే. టీడీపీ ట్రాప్ లో వైసీీపీ పడినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News