మదర్ వెదర్ మార్చేసిందట

రాజ‌కీయాల్లో గురువును మించిన శిష్యులు.. అన్నను మించిన త‌మ్ముళ్లను మ‌నం చూస్తేనే ఉన్నాం. ఆనం వివేకానంద‌రెడ్డి ముందుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. త‌ర్వాత వ‌చ్చిన ఆయ‌న త‌మ్ముడు రామ‌నారాయ‌ణ [more]

Update: 2019-07-30 03:30 GMT

రాజ‌కీయాల్లో గురువును మించిన శిష్యులు.. అన్నను మించిన త‌మ్ముళ్లను మ‌నం చూస్తేనే ఉన్నాం. ఆనం వివేకానంద‌రెడ్డి ముందుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. త‌ర్వాత వ‌చ్చిన ఆయ‌న త‌మ్ముడు రామ‌నారాయ‌ణ రెడ్డి మంత్రిగా చ‌క్రం తిప్పడంతోపాటు రాజ‌కీయంగా క్లాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇక‌, ధ‌ర్మాన సోద‌రుల్లోనూ ఇదే ప‌రిస్తితి. ధ‌ర్మాన రాజ‌కీయాల గురించి మాట్లాడితే.. వెంట‌నే గుర్తుకు వ‌చ్చే పేరు ధ‌ర్మాన ప్రసాద‌రావు. కానీ, ఆయ‌న అన్న కృష్ణదాస్ ముందుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. కానీ, జ‌గ‌న్ ఇప్పుడు ఏర్పాటు చేసుకున్న కేబినెట్లో కృష్ణదాసుకు అవ‌కాశం ఇచ్చాక కానీ.. ఆయ‌న పేరు రాష్ట్రంలో చాలా త‌క్కువ మందికే తెలుసు.

తల్లి కారణమంటూ….

ఇక‌, గురు శిష్యుల విష‌యానికి వ‌స్తే.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, డొక్కా మాణిక్యవ‌ర‌ప్రసాద‌రావు. సుజ‌నా చౌద‌రి, అన్నం స‌తీష్ ప్రభాక‌ర్‌లు గురువులు, శిష్యులు అయితే, రాజ‌కీయాల్లో మాత్రం శిష్యులే పేరు తెచ్చుకున్నారు. ప్రజ‌ల్లో దూసుకుపోయి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా రాజ‌కీయాల్లో ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించుకోవ‌డం కొత్తకాదు. కానీ, ఇదే టీడీపీలో త‌ల్లీ కూతుళ్లు రాజ‌కీయాలు చేశారు. అయితే, నిజానికి త‌ల్లిని మించి కూతురు ఎద‌గాల్సింది పోయి.. కూతురు రాజకీయంగా పతనమవ్వడానికి ప‌రోక్షంగా త‌ల్లే కార‌ణ‌మ‌వ‌డం ఇక్కడ చెప్పుకోవాల్సిన విష‌యం. అనంత‌పురం జిల్లా సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యేగా శ‌మంత‌క‌మ‌ణి టీడీపీ నుంచి ప‌లుమార్లు విజ‌యం సాధించారు.

కుటుంబంలో రాజకీయ వైరం….

ఆ త‌ర్వాత వ‌యసు పైబ‌డ‌డంతో ఆమె త‌న కుమార్తె యామినీ బాల‌ను రాజకీయాల్లోకి తెచ్చారు. అప్పటి వ‌ర‌కు టీచ‌ర్‌గా ఉన్న యామినీబాల 2014లో త‌ల్లి ప్రోత్సాహంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సింగ‌న‌మ‌ల‌లో విజ‌యం సాధించారు. తొలి విజ‌యంతోనే ఆమె చంద్రబాబు కేబినెట్‌పై క‌న్నేశారు. అయితే, అది అంద‌ని మావిగా మారిపోయింది. దీనికి కార‌ణం త‌న త‌ల్లేన‌ని భావించిన ఆమె..త‌ల్లితోనే రాజ‌కీయ వైరం పెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో 2019లో త‌ల్లీ కూతుళ్ల మ‌ధ్య టికెట్ వివాదం తార‌స్థాయికి చేరింది. త‌న కుమారుడికి ఈ ద‌ఫా టికెట్ ఇవ్వాల‌ని శ‌మంత‌క‌మ‌ణి ప‌ట్టుబ‌ట్టింది.

తల్లికి ఎమ్మెల్సీ పదవి….

అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యేను కాబ‌ట్టిత‌న‌కే ఇవ్వాల‌ని యామినీ బాల ష‌ర‌తు పెట్టింది. ఈ నేప‌థ్యంలో స‌ర్వే చేయించిన చంద్రబాబు ఈ టికెట్‌ను ఈ ఇద్దరికీ కాకుండా వేరేవారికి కేటాయించారు. దీంతో ఇక్కడ టీడీపీ ఓడిపోయింది. అయితే, శ‌మంత‌క‌మ‌ణి ఎమ్మెల్సీగా ఉండ‌డంతో మ‌రి కొద్ది రోజుల పాటు ఆమె రాజకీయాల్లోనే ఉండ‌నున్నారు. అయితే, యామ‌ని మాత్రం టికెట్ ద‌క్కించుకోక‌పోగా, స్తానికంగా టీడీపీలో తీవ్ర వ్యతిరేక‌త ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమెపూర్తిగా రాజ‌కీయాల‌కే దూర‌మైన ప‌రిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూస్తే.. త‌ల్లిపై కూతురు పైచేయి సాధించ‌క‌పోగా.. రాజకీయంగా తీవ్ర వ్యతిరేక‌త‌తో ఇంటికే ప‌రిమిత‌మైన ప‌రిస్తితి ఏర్పడింది. దీనిని గ‌మ‌నించిన స్థానికులు ద‌టీజ్ పాలిటిక్స్ అని స‌రిపెట్టుకుంటున్నారు.

Tags:    

Similar News