ఢిల్లీని పొలిటకల్ ప్రయోగశాల చేశారు

డిల్లీ ఓటమితో బీజేపీ పని అయిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. అవును 2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే మనకి అర్థమవుతుంది. అప్పటికే కాంగ్రెస్ పరిపాలనతో విసిగి వేసారిపోయిన [more]

Update: 2020-02-12 17:30 GMT

డిల్లీ ఓటమితో బీజేపీ పని అయిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. అవును 2013 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే మనకి అర్థమవుతుంది. అప్పటికే కాంగ్రెస్ పరిపాలనతో విసిగి వేసారిపోయిన డిల్లీ ప్రజలు, మరో జాతీయ పార్టీ ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. బీజేపికి 31 ,కాంగ్రెస్ కి 8 సీట్లు, అదే సమయంలో అవినీతి వ్యతేరిక ఉద్యమం నుంచి వచ్చిన కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి తొలి ప్రయత్నంలోనే 28 సీట్లిచ్చిన డిల్లీ ప్రజలు కేజ్రీ ని ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారని స్పష్టంగా తెలుస్తంది.

కాంగ్రెస్ విధానాలను విభేదించి…..

కాంగ్రేస్ మద్దతు తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు. అయితే ఆప్ తీసుకునే ప్రతి నిర్ణయానికి కాంగ్రెస్ మోకాలు అడ్డు పడడంతో, అధికారం ఉన్నా ఎమీ చేయలెకపోతున్నానన్న ఆవేదనతో రెండు నెలలు తిరక్కుండానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. పొత్తులతో ప్రభుత్వాన్ని నడపలేమని, స్వయం నిర్ణయాలను తీసుకోలేమని కేజ్రీవాల్ కు అప్పుడే అర్థమయింది. అందుకే ఒంటరిగానే పోటీ చేసి గెలవాలన్న లక్ష్యంతో 2015 ఎన్నికల బరిలోకి దిగారు.

రెండోసారి చాలా స్పష్టంగా….

కేజ్రీవాల్ ఆవేదన ని అర్ధం చేసుకున్న డిల్లీ ప్రజలు ఈసారి రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి ఆప్ కి 67 సీట్లు కట్టబెట్టారు. రెండు నెలలు తిరక్కుండానే రాజీనామా చేసిన కేజ్రీ నిబద్దతముందు మోడీ హవా కూడా పని చేయలేకపోయింది. ఇది కచ్చితంగా ప్రజల విజయమనే చెప్పుకోవాలి. అయితే తొలి నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందలేదు. గడ్కరీ, అరుణ్ జైట్లీ వంటి వారు పరువు నష్టం దావా వేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా మర్యాదస్థుడిగానే మెలిగారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ తో నిత్యం ఫైట్ తప్పనిసరి అయింది. దీంతో చివరి ఏడాది మాత్రం కేజ్రీవాల్ కేవలం ఎన్నికలపైనే దృష్టి పెట్టారు.

సుపరిపాలనకి కిరీటం ….

అయితే డిల్లీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయని కేజ్రీవాల్ తన మార్కు పరిపాలనతో సుపరిపాలన ఫలాల రుచి చూపించాడు. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పదకాలను పెడుతుంది, కానీ కేజ్రీవాల్ వాటి అమలు విధానంలో పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాడు. మొహల్లా క్లినిక్ లతో మెరుగైన వైద్యాన్ని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యని అందించడంలో సఫలీకృతమయ్యాడు. అన్నిటికంటే ముఖ్యంగా మహిళలకి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం గొప్ప విషయం. అందువల్లనే గతం కంటే మహిళా ఓట్లు కేజ్రీవాల్ కు 6 శాత పెరిగాయి.

సానుకూల అంశాలతో……

ఇన్ని సానుకూలాంశాల మధ్యలో బీజేపి వచ్చి అంతకంటే ఎక్కువ చేస్తామంటే ప్రజలు నమ్మలేకపొయారు. మరో పార్టీకి అధికారం ఇచ్చి ప్రయోగాల జోలికి వెళ్లకుండా ముచ్చటగా మూడోసారి కేజ్రీవాల్ కే పట్టం కట్టారు డిల్లీ వాసులు. అయితే బీజేపీ ఒక రాజకీయ పార్టీగా తాను గెలవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైంది. మొత్తంగా ఆలోచిస్తే కళ్ల ముందు కనిపిస్తున్న సంక్షేమమే కేజ్రీవాల్ కి మల్లీ గెలుపు కిరీటం తెచ్చిపెట్టిందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ ఓటమితో బీజేపి పని అయిపోయిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. మొన్నటికి మొన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏడుకి ఏడు సీట్లల్లో 56 శాతం పైగా ఓట్లతో బీజేపీని గెలిపించి కేంద్రంలో బీజేపీకి తాము అనుకూలమని ప్రజలు చెప్పకనే చెప్పారన్న విషయాన్ని మనం గమనించాలి.

 

 

Tags:    

Similar News