చీపురుతో ఊడ్చేద్దామంటే కుదురుతుందా?

ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్గీని కేజ్రీవాల్ జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని గత కొన్నేళ్లుగా తప్పన పడుతున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. జాతీయపార్టీగా [more]

Update: 2021-02-08 17:30 GMT

ప్రాంతీయ పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్గీని కేజ్రీవాల్ జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని గత కొన్నేళ్లుగా తప్పన పడుతున్నారు. అయితే అది సాధ్యం కావడం లేదు. జాతీయపార్టీగా ఆమ్ ఆద్మీ పార్టీని తీర్చి దిద్ది హస్తిన పీఠాన్ని అధిష్టించాలన్నది అరవింద్ కేజ్రీవాల్ బలమైన కోరికగా ఉంది. అయితే ఆచరణ సాధ్యమా? అన్నది ప్రశ్నే. ఢిల్లీ అసెంబ్లీ వరకూ కేజ్రీవాల్ కు తిరుగులేదు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిని చేశారు. తిరుగులేని నాయకుడిగా ఎదిగారు.

ఇతర రాష్ట్రాల్లో….

కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ కనీస స్థాయికి గత ఏడెనిమిదేళ్లుగా తీసుకెళ్లలేకపోయారు. అనేక రాష్ట్రాల్లో ప్రయత్నించి విఫలమయ్యారు. ఒక్క గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో తప్పించి ఎక్కడా ఆమ్ ఆద్మీ పార్టీ బోణీ కూడా కొట్టలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణాలు ఢిల్లీ పై పెట్టిన శ్రద్ధ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాలపై పెట్టకపోవడమేనంటున్నారు. దీంతోపాటు ఢిల్లీ పరిస్థితులకు, ఇతర రాష్ట్రాల్లోని సామాజిక, ఆర్థిక పరిస్థితులకు తేడా ఉందంటున్నారు.

ఆరు రాష్ట్రాల్లోనూ….

మరోసారి కేజ్రీవాల్ ఆరు రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కేజ్రీవాల్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ఆరు రాష్ట్రాల్లో పంజాబ్, గోవా మినహా ఎక్కడా కేజ్రీవాల్ పార్టీకి పట్టు లేదనే చెప్పాలి. గోవాలో కొంత పోటీ ఇచ్చే అవకాశముందని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు.

సాధ్యం కాకపోవచ్చు….

ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న సామాజిక సమీకరణాలు, కుల, మత రాజకీయాలను చూస్తే కేజ్రీవాల్ కాలు మోపడమూ కష్టమేనంటున్నారు. ఉత్తరాఖండ్ లోనూ అదే పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అది సాధ్యపడటం లేదు. మొత్తం మీద ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి మరింత అత్యున్నత పదవిని చేపట్టాలన్న ఆయన కోరిక మాత్రం ఇప్పట్లో నెరవేరదనే చెప్పాలి.

Tags:    

Similar News