kejriwal : కింగ్ మేకర్ అవుతారట

ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పై ఉన్న నమ్మకంతోనే ఆయనకు ప్రజలు వరసగా పట్టం కట్టారు. ఆయన పాలనలో ప్రజాసంక్షేమంతో [more]

Update: 2021-10-03 16:30 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పై ఉన్న నమ్మకంతోనే ఆయనకు ప్రజలు వరసగా పట్టం కట్టారు. ఆయన పాలనలో ప్రజాసంక్షేమంతో పాటు అవినీతికి చోటు ఇవ్వకపోవడంతోనే ప్రజలు ఆయనపై నమ్మకం పెంచుకున్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు.

కీలకంగా మారి…

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఎన్నికల్లో కీలకంగా మారబోతుంది. ఇప్పటికే పంజాబ్ లో గతంలో బోణీ కొట్టింది. ఈసారి కాంగ్రెస్, బీజేపీల్లో ఉన్న అనైక్యతను అరవింద్ కేజ్రీవాల్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారు. పంజాబ్ లో తమ పార్టీ పోటీకి దిగుతుందని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన క్యాడర్ తో పాటు ఓటు బ్యాంకు కూడా కలసి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.

వారు వీక్ కావడంతో….

బీజేపీ పై పంజాబ్ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. రైతు చట్టాల పట్ల పంజాబ్ నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత బహుశ ఏ రాష్ట్రం నుంచి వ్యక్తం కాలేదని చెప్పాలి. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతు తెలిపి తన సంఘీభావాన్ని ప్రకటించారు. బీజేపీ నుంచి శిరోమణి అకాలీదళ్ విడిపోవడంతో ఆ పార్టీ మరింత బలహీనమయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

కర్ణాటక తరహాలో….

ఈ నేపథ్యంలో లోకల్ పార్టీలతో పొత్తుతో ముందుకు వెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి, అసమ్మతులు కూడా తమకు కలసి వస్తాయని చెబుతున్నారు. పంజాబ్ ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీల మధ్య పోటీలో తాను కింగ్ మేకర్ ను అవుతానన్న నమ్మకంతో ఉన్నారు. కర్ణాటక తరహాలో పంజాబ్ లో కాలుమోపుతామన్న ధీమాగా ఉన్నారు.

Tags:    

Similar News