అత్యాశ కాక మరేంటి?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అత్యాశ ఎక్కువయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుని ఆయన దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2020-02-22 17:30 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు అత్యాశ ఎక్కువయింది. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూసుకుని ఆయన దేశ వ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగా లేకపోవడంతో ఢిల్లీ లాగే మిగిలిన రాష్ట్రాల్లోనూ సామాన్యుడి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. త్వరలో జరిగే బీహార్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చేయడానికి సిద్దమవుతుంది. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే ఆమ్ ఆద్మీ పార్టీని బీహార్ లో ముందుకు తీసుకెళ్లాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

అక్కడ బలోపేతమైతే?

ఇక మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంపై కూడా కేజ్రీవాల్ కన్ను పడిందంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ అతి పెద్ద రాష్ట్రం. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని బలోపేతం చేయగలిగితే దేశమంతటా తమకు తిరుగులేదని కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేజ్రీవాల్ నిర్ణయించారు. ఇక్కడ కాంగ్రెస్ బలహీనంగా ఉండటం, సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ ల పాలనను చూసి ఉండటంతో ప్రజలు తమవైపు మొగ్గు చూపే అవకాశముందని కేజ్రీవాల్ అంచనా వేస్తున్నారు.

అంత సులువా?

కానీ ఉత్తర్ ప్రదేశ్ ను చేజిక్కించుకోవడం ఢిల్లీ అంత సులువు కాదు. 430 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో క్యాడర్ ను ఏర్పాటు చేసుకోవడమూ కష్టసాధ్యమే. ఇప్పటికే అక్కడ ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. కుల రాజకీయాలు ఎక్కువ. దళితులు, యాదవ సామాజికవర్గం బలంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా బలంగా ఉంది.

బలంగా ఉన్న…..

ిఅయినా కేజ్రీవాల్ మాత్రం ఒక ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. 23వ తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కేజ్రీవాల్ పార్టీ ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభించనుంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు 2022 లో జరగనున్నాయి. అంటే ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో అతి పెద్ద రాష్ట్రంలో కేజ్రీవాల్ పార్టీ మనుగడ అసాధ్యమనే చెప్పాలి. కేజ్రీవాల్ ఎంట్రీతో కొద్దో గొప్పో విపక్షాల ఓట బ్యాంకు కు చిల్లుపెట్టే అవకాశమే ఎక్కువగా ఉంది. చూద్దాం మరి కేజ్రీవాల్ పెద్ద ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో?

Tags:    

Similar News